అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న మోదీ  సర్కార్  కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత 70 ఏళ్ల నుంచి ఎవరికీ సాధ్యం కాని 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ భూభాగాన్ని కూడా భారత్ లో కలిపేసింది  కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక ప్రస్తుతం అక్కడి విధివిధానాలను మారుస్తూ పూర్తిగా భారతదేశానికి సంబంధించిన విధివిధానాలు అక్కడ అమలయ్యే విధంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్లో అంతకు ముందు ఉన్న చట్టాలు మర్చి  ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలు అమలు అవుతున్నాయి. పోలీసు వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి

 

 ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులు ఎవరైనా ఉండేందుకు మార్పు చేశారు. అంతేకాకుండా జమ్మూకాశ్మీర్లో ఉద్యోగాలు  చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కూడా స్థానికత చట్టానికి ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఇక జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ లేదు కాబట్టి... చట్టాలన్నీ కూడా గవర్నర్ చేతుల మీదుగా ని అమలు అవుతాయి. మామూలుగానే టూరిస్ట్ ప్లేస్ లలో స్థిరాస్తులు కొనుక్కోవడం,  ఇల్లు కట్టుకోవడం కొంత మందికి సరదాగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. 

 


 ఇప్పటికే ఎంతోమంది భారతీయులు వివిధ పర్యాటక ప్రాంతాలలో కూడా భూములు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకుని ప్రస్తుతం వాటిని లీజ్ కి ఇస్తున్న  వారు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం అక్కడ స్థిరాస్తులు కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో కాశ్మీర్ లో భారీగా రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎకరా కేవలం లక్షల్లో మాత్రమే ఉండేది అది కూడా 5 లక్షల లోపు మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రం రెండున్నర నుంచి మూడు కోట్ల మధ్య ఒక ఎకరం నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: