దేశమంతటా ఇప్పుడు కరోనా కలకలం రేగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇక ఏపీలోనూ ఇదే సీన్. అయితే ఇప్పుడు కరోనాతో పాటు మరో వ్యాధి కూడా ఏపీలోని కొన్ని ప్రాంతాల వారిని వణికిస్తోంది. అదే కాళ్ల వాపు వ్యాధి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వ్యాధి విస్తరిస్తోందని వార్తలు వస్తున్నాయి.

 

 

ఈ విషయం సీఎం జగన్ వరకూ వెళ్లడంతో తూర్పుగోదావరి జిల్లా కాళ్లవాపు వ్యాధి ఘటనలపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి మళ్లీ విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బాధితులకు సరైన వైద్యచికిత్స అందించాలని, వారిని ఆదుకోవాలని ఉన్నతాధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

 

 

ఈ కాళ్ల వాపు వ్యాధిబాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నానిని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మళ్లీ ఈ కాళ్లవాపు వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఓవైపు కరోనా తో రాష్ట్రమంతా పోరాడుతున్నా.. ఇతర వ్యాధుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని జగన్ చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: