టీడీపీ అధినేత చంద్రబాబు సరిగ్గా గత ఎన్నికలకు ముందు నుండి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయననే ముంచేస్తున్నాయి అని చాలామంది అంటారు. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని అది పెద్ద సంజీవిని కాదని చెప్పిన చంద్రబాబు, సరిగ్గా 2019  ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గురించి బిజెపితో పొత్తు వదులుకొని బయటకు రావటం రివర్స్ రాజకీయాలకు నాంది పలికింది. అప్పటినుండి చంద్రబాబు చాలా విషయాలలో యూటర్న్ రాజకీయాలు చేస్తూ ప్రజల లో పలచన పడిపోవడం జరిగింది. 'రైతు రుణమాఫీ' విషయంలో గానీ 'కాపు రిజర్వేషన్' అంశంలో గాని చంద్రబాబు యూటర్న్ మాదిరిగా వ్యవహరించడం వల్లే 2019 ఎన్నికల్లో ఆయన మాటలను ప్రజలు నమ్మలేకపోయారాని చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతుంటారు.

 

అందువల్లే అంత చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగిందని విశ్లేషిస్తుంటారు. అయినా కానీ ప్రతిపక్షంలో అతి స్వల్ప మెజారిటీతో ఉన్న చంద్రబాబు ఇంకా యూ టర్న్, రివర్స్ రాజకీయాలు మానుకోలేదని ఇటీవల సీబీఐ విషయంలో బయటపడింది అని పలువురు అంటున్నారు. మత్తు  డాక్టర్ సుధాకర్ కేసును ఏపీ హైకోర్టు ఇటీవల సీబీఐ కి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు హైకోర్టు తీర్పును ఉద్దేశించి సుధాకర్ కేసు సీబీఐ కి ఇవ్వటం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఇదే చంద్రబాబు సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టకూడదని జీవో ఇవ్వటం జరిగింది. అలాంటి చంద్రబాబు కి ప్రతిపక్షంలో కి వెళ్ళాక సీబీఐ మంచిది అయిపోయిందా అని వైసీపీ నాయకులతో పాటు ఏపీ జనాలు కూడా నిలదీస్తున్నారు.

 

ఆయన హయాంలో వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలో అవసరం లేని సీబీఐ ఇప్పుడు అవసరం అయిందా అంటూ వైసీపీ నాయకులు నిలదీస్తున్నారు. పేదలకు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రతి విషయంలో అడ్డుపడుతున్న చంద్రబాబుని ప్రజలు గమనిస్తున్నారని రాజకీయాలలో ఆయన ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చివరాకరికి ఆయనకి శాశ్వత రాజకీయానికి ముగింపు పలికే అవకాశం ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: