ఏపీ సీఎం జగన్ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏ పాలకుడైనా విజయోత్సవాలు జరుపుకుంటారు. పార్టీ శ్రేణులూ అదే పని చేస్తాయి. మా పాలన అదుర్స్.. మేం మహా గొప్పగా పాలించాం అని డబ్బా కొట్టుకుంటారు. రాజకీయాల్లో ఇది చాలా సహజంగా మారింది. ఇన్నాళ్లూ అదే జరిగింది.

 

 

కానీ జగన్ రూటే సెపరేటు అని మరోసారి నిరూపించుకున్నారు. ఏడాది పాలన బాగానే సాగిందని మనం అనుకుంటే కాదు కదా. జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఇంకా లోపాలు ఉంటే దిద్దుకోవాలి. రాబోయే నాలుగేళ్లు ఇంకా బాగా పాలించాలి. ఇదీ జగన్ ఆలోచన. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ఏడాది పాలనపై సమీక్షలు. అందుకే ఆయన మన పాలన – మీ సూచన పేరుతో తన ఏడాది పాలనపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

 

 

మరి ఈ సమీక్షల్లో ఏం చేస్తారు.. ఈ ఏడాది పాలనలో వైకాపా సర్కారు ఏం చేసిందో వివరిస్తారు. తన ఏడాది పాలన ప్రజల్లో ఏ మేరకు మార్పు తెచ్చిందో వివరిస్తారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. ఇంకా జనం ఏమేం కోరుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ మేరకు పాలనలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఏడాది విజయోత్సవాల సమయంలో జగన్ చేపట్టిన ఈ సమీక్ష కార్యక్రమం ప్రజలకు మరింత మేలు చేసేదే అని చెప్పొచ్చు.

 

 

గడచిన సంవత్సర కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎలా అడుగులు ముందుకు వేసింది. అడుగులు బాగానే వేశామా.. ఇంకా ఎక్కడైనా రిపేర్లు చేసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉందా అని తెలుసుకునేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామంటున్నారు సీఎం జగన్. ఈ ఐదు రోజుల పాటు ఒక్కొక్క అంశంపై చర్చలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారాయన.

 

మరింత సమాచారం తెలుసుకోండి: