ఈ మద్య డబ్బు సంపాదన కోసం ఉచ్చనీచాలు మరచి అడ్డదారుల్లో అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు కొంత మంది కేటుగాళ్లు.  ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.. ఎదుటి వారిని మోసం చేసి తాము లబ్ది పొందుతున్నారు. అక్రమ డబ్బు సంపాదన కోసం హైటెక్ వ్యభిచారం, డగ్ర్స్ దందా, అక్రమ ఆయుధ వ్యాపారం ఇలా ఎన్నో దందాలు చేస్తున్నారు.  అమాయకమైన ఆడవారిని లొంగ దీసుకొని వారిచే వ్యభియారం చేయిస్తూ కోట్లు దండుకుంటున్న ఎంతో మంది వైట్ కాలర్ నేరస్తులు ఉన్నారు.  అయితే రెండు నెలలు లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు పూర్తిగా మూసి వేసిన విషయం తెలిసిందే.  ఈ సమయంలో కొంత మంది కేటుగాళ్లు అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ డబ్బు బాగా సంపాదించాడు. తాజాగా రోగులకు వైద్యం చేస్తూ.. వారి ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్ డబ్బు కోసం దారి తప్పాడు.

 

డబ్బులు సంపాధించడమే పరమావదిగా అడ్డదారులు తొక్కాడు. మద్య నిషేధాన్ని సైతం పట్టించుకోకుండా వైద్యం మానేసి మద్యం అమ్మకాలను గుట్టుగా సాగించడం ప్రారంభించాడు.   గుంటూరు జిల్లా రాజేంద్ర నగర్‌లో చోటు చేసుకుంది. అతని వద్ద నుంచి 53 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. ఏపీలో బెల్ట్ షాపుల నిర్వహణకు అనుమతి లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటంతో మద్యం ద్వారా డబ్బులు సంపాధించాలని డాక్టర్ లావు వంశీ కృష్ణ అనుకున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తెప్పించి ఇక్కడు అమ్మడం ప్రారంభించాడు.  

 

ఈ విషయం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలో వంశీకృష్ణ కారు డిక్కీలో 16 మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. వాటికి కర్ణాటక లేబుల్స్ ఉన్నట్టు గుర్తించారు. దాంతో అతని ఇంటికి వెళ్లి సోదా చేయగా విదేశీ స్కాచ్‌ విస్కీతో పాటు మరో 37 దేశీయ మద్యం సీసాలు లభించాయి. దీంతో అతని వద్ద ఉన్న రూ.20 లక్షల విలువ చేసే కారు, మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: