ఎక్కడో చైనాలో పుహాన్ లో పుట్టిన ఒక భయంకరమైన వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చుట్టేసింది. ప్రపంచ దేశాల్లో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కష్టం ఏంటో చూపించింది.  ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక కష్టాలు తెచ్చిపెట్టింది.. కోట్ల ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి.. ఎంటర్ టైన్ మెంట్ అంటే భయపడే పరిస్థితికి వచ్చింది.  2020 ఎప్పుడు ముగుస్తుందిరా బాబోయ్ అన్నంత భయంగా జనాలు బతుకుతున్నారు.  ఎక్కడో వేళ్లమీద లెక్కబేట్టే విధంగా ఈ కరోనా లేని ప్రాంతాలు తప్ప ప్రపంచంలో అంతటా దీని ప్రభావం చూపించింది.  ఎక్కడ చూసినా కరోనా కరాళనృత్యం చేస్తున్నది 214 దేశాలకు విస్తరించిన ఈ ప్రాంణాంతక వైరస్‌ ఇప్పటివరకు 3,47,872 మందిని పొట్టన పెట్టుకున్నది. ప్రపంచవ్యాప్తంగా 55,87,582 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో 23,65,703 మంది కోలుకోగా, మరో 28,74,007 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.  

 

రష్యాలో కరోనా మృతుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ, పాజిటివ్‌ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 353,427 కేసులు నమోదవగా, 3633 మంది మరణించారు. మరో 2,30,996 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. స్పెయిన్‌లో కరోనా కేసుల సంఖ్య 2,82,480కి చేరాయి. ఇటలీలో 230,158 పాజిటివ్‌ కేసులు ఉండగా, 32877 మంది కన్నుమూశారు. ఫ్రాన్స్‌లో 182,942 పాజిటివ్‌ కేసులు ఉండగా, 28,432 మంది మరణించారు. కరోనా వైరస్‌తో జర్మనీలో 180,789 కేసులు, 8428 మృతులు, టర్కీలో 157,814 కేసులు, 4369 మరణాలు సంభవించాయి.

 

 దేశంలో ఇప్పటివరకు 26,837 మంది మరణించారు. ఇక మన దేశంలో  కరోనా వైరస్ కేసులు ప్రతిరోజు 6,000పైగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,535 మందికి కొత్తగా కరోనా సోకగా, 146 మంది మరణించారు.  ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,45,380కి చేరగా, మృతుల సంఖ్య 4,167కి చేరుకుంది.  ఇంత టెక్నాలజీ ఉన్నా దీనికి వ్యాక్సిన్ మాత్రం ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: