దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ విధానాన్ని అమలులోకి తీసుకరావడం జరిగింది . ఈ తరుణంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జూన్ నెలలో డిగ్రీ, ఇంజనీరింగ్ చివరి సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీలో షెడ్యూలు విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు నష్ట పోకుండా ఉండేందుకు నిర్వహణ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక గతంలో మూడు గంటల పాటు నిర్వహించే పరీక్షలను... ఇప్పుడు రెండు గంటలకు నిర్వహించేందుకు ఆమోదించడం జరిగింది.


జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జూన్ నెల 20వ తేదీ నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. గతంలో పార్ట్ వన్ పార్ట్ - 2 లో ప్రశ్నలు ఉండేవి పార్ట్ 1 లో ఛాయిస్ ఉండేది కాదు. పార్ట్ 2 మాత్రమే ఛాయిస్ అనే ఆప్షన్ ఉండేది కానీ ఇప్పుడు అన్నిటిలో కూడా ఛాయిస్ ఉండేలాగా ప్రశ్నపత్రాలు నియమించడం జరిగింది. ఇక ఒక్కో పరీక్షకు రెండు గంటల కాల వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 31 వరకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. డిగ్రీ పరీక్షలకు కూడా రెండు గంటల సమయం కేటాయించబోతున్నారని యూనివర్సిటీ అధికారులు తెలియజేస్తున్నారు. 


విద్యార్థులకు జూన్ 10వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఇక కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకే పరీక్షలను సులభరీతిలో పూర్తి చేస్తున్నట్లు యాజమాన్యం తెలియజేస్తుంది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో చదువుతున్న ప్రతి విద్యార్థి ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ నామినేట్ చేసిన అధ్యాపకులతో ప్రాజెక్టు పని తీరు విద్యార్థుల సామర్ధ్యాలు అనుగుణంగా మార్పులు గ్రేడ్లు కేటాయించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం భౌతిక దూరం పాటించాల్సి రావడంతో పాటు విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు ఎక్కడా కనబడటం లేదు. దీనితో JNTUH ఆన్లైన్ లో వైవా నిర్వహించేందుకు షెడ్యూల్ ను విడుదల చేయబోతోంది. అంతేకాకుండా జగిత్యాల ఉస్మానియా యూనివర్సిటీ లు చెందిన ప్రొఫెసర్లు వైవాలో పాల్గొనబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: