దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో కరోనా రోగులకు చికిత్స అందించేవారు కరోనా భారీన పడుతున్నారు. తాజాగా ఒక నర్సు కరోనా భారీన పడి మృతి చెందింది. ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పతిలో పని చేస్తున్న అంబిక(46) అనే నర్సు కరోనా భారీన పడి మృతి చెందగా ఆమె ప్రాణం పోవడానికి పీపీఈ కిట్ కారణమని తెలుస్తోంది. 
 
కరోనా సోకడంతో అంబిక ఈ నెల 21వ తేదీన సాఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 24వ తేదీన ఆమె కన్నుమూసింది. ఢిల్లీలో కరోనాతో మృతి చెందిన మొదటి నర్సు అంబిననే కావడం గమనార్హం. ఢిల్లీలొని ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న అంబిక వాడిన పీపీఈ కిట్‌లనే తిరిగి ధరించడం వలన చనిపోయినట్లు తెలుస్తోంది. అదే ఆస్పత్రిలో పని చేసే సీనియర్ నర్సు ఈ ఘటన గురించి స్పందించారు. 

IHG
 
ఆస్పత్రిలో డాక్టర్లకు కొత్త పీపీఈ కిట్లను ఇస్తున్నారని... నర్సులకు మాత్రం వాడిన పీపీఈ కిట్లనే మరలా వాడాలని చెబుతున్నారని... నర్సులు ఎవరైనా వాడిన పీపీఈ కిట్ ను ధరించడానికి అభ్యంతరం చెబితే వాడిన పీపీఈ కిట్ నే వాడాలని... కొత్తవి ఇవ్వలేమని వారు చెబుతున్నారని ఆమె తెలిపారు. గత వారం పీపీఈ కిట్ విషయంలో నర్సింగ్ ఇంఛార్జీకు అంబికకు మధ్య గొడవ జరిగిందని ఆమె అన్నారు. 
 
అంబిక కొడుకు తల్లి మృతిపై స్పందిస్తూ వాడిన పీపీఈ కిట్ లనే మరలా వాడాలని చెబుతున్నారని అమ్మ చెప్పిందని... ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండమని అమ్మకు తాను సూచించానని చెప్పారు. అయితే పీపీఈ కిట్ల విషయంలో వస్తున్న ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. ఒకవేళ అలా ఏదైనా జరిగిందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని . ఆసుపత్రి యజమాని డా. ఆర్కే కర్ల మీడియాకు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: