జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పరిపాలనలో చాలా ఎత్తుపల్లాలే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న టైంలో జగన్ చేస్తున్న పోరాటానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా 'రావాలి జగన్ కావాలి జగన్' అనే నినాదాన్ని అందుకుని భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ చాలా దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ఒకపక్క సంక్షేమాన్ని అందిస్తూనే మరోపక్క ప్రతిపక్షాలకు చెక్ పెట్టే ప్రయత్నాలలో తన గొయ్యి తానే తవ్వకుంటున్నాడు అన్న వాదన ప్రజలలో ప్రస్తుతం బలంగా వినబడుతోంది. మూడు రాజధానులు విషయం అదే విధంగా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం లో ఇంకొన్ని విషయాలలో చాలా దూకుడుగా వ్యవహరించిన జగన్ సర్కార్ కి న్యాయస్థానాలలో మొట్టికాయలు గట్టిగా పడిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఇదిలా ఉండగా టీటీడీ భూములు విషయంలో గత ప్రభుత్వం టిడిపి సర్కార్ నిర్ణయాన్నే అమలు చేసేందుకు వై వి సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలకమండలి రెడీ అవటం ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపింది. దీనిని ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు మతతత్వ రాజకీయాలకు పాల్పడటంతో జగన్ సర్కారు వెనక్కి తగ్గింది. ప్రభుత్వానికి ఏ మాత్రం లాభం లేని ఈ భూముల విక్రయాలు విషయంలో చాలామంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పనికిరాని నిర్ణయాల్లో గత ప్రభుత్వం చేపట్టిన విషయాలలో జగన్ సర్కార్ అనవసరంగా వేలుపెట్టి విమర్శలు కొనితెచ్చుకున్నట్లు టాక్ ఏపీలో బలంగా వినిపిస్తోంది. ఇలా చాలా దూకుడుగా జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానం వల్ల ఒకపక్క హైకోర్టులో మరోపక్క ప్రజాక్షేత్రంలో పలచన పడిపోతున్నారు. 

 

గతంలో ‘రావాలి జగన్ కావాలి జగన్’ అన్న వాళ్లు ‘మారాలి జగన్’ అనే స్థాయికి పరిస్థితి మారిపోవడం ఏపీ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ప్రతి పక్షాలు అంటున్నాయి. ఎంత సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న గానీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజలలో ప్రభుత్వం పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీటీడీ భూముల విక్రయం లో వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం… మరి కొన్ని విషయాల్లో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం నెలకొంటుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: