చంద్రబాబునాయుడు పేరుకు ముందు అనేక బిరుదులు ఉంటాయి. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ, ముమ్మారు ముఖ్యమంత్రి, ముమ్మారు ప్రతిపక్ష నేత అని, కానీ ఇపుడు రెండుమార్లే ప్రతిపక్ష నేత అని చదువుకోవాల్సివుంటుందేమో. ఎందుకంటే చంద్రబాబు విపక్ష హోదాకు గండం పొంచి ఉంది. అన్నీ కలసి వస్తే ఆయన్ని జూన్ లో జరిగే శాసన సభ సమావేశాలకు ముందే  విపక్ష పదవి నుంచి దించేందుకు వైసీపీ పూర్తి గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టింది.

 

చంద్రబాబు డిసెంబర్ అసెంబ్లీ సమావేశాల వరకూ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేతగానే ఉన్నారు, ఇపుడు జూన్ లో జరిగే అసెంబ్లీ సమవేశాల నాటికి ఆయన‌కు ఆ హోదా ఉంటుందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. కరోనా మహమ్మారి అలా ఉండగానే జన జీవనం మోదలైపోయింది. అంతా భయంగా బతుకులు మొదలుపెడితే రాజకీయం మాత్రం యధాప్రకారం జడలు విప్పుకుంటోంది.

 

ఏపీలో మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ కి వైసీపీ తెర తీసినట్లుగా సీన్ కనిపిస్తోంది. టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి టచ్ లోకి వచ్చారన్న న్యూస్ బాగా ప్రచారంలో ఉంది. ఇదే కనుక నిజం అయితే చంద్రబాబు విపక్ష పాత్ర ఇక ముగిసినట్లే. గత ఏడాది ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ముగ్గురు వైసీపీకి మద్దతుగా ఉన్నారు. వారిలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూర్ వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి జగన్ పార్టీకి మద్దతు ఇచ్చారు. 

 

ఇక ఇపుడు మరో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గడప దాటబోతున్నారు అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం చంద్రబాబు పదవి పోయినట్లే. చంద్రబాబు ఇన్నాళ్ళ రాజకీయ జీవితంలో ఏదో ఒక పదవిలో ఉన్నారు. ఇపుడు విపక్ష పాత్ర ముగిసి సాధారణ ఎమ్మెల్యేగా మిగలడం అంటే అది బాబు రాజకీయ జీవితానికి అతి పెద్ద దెబ్బగానే చూడాలి. మరి వైసీపీ పట్టుదల, వ్యూహాలు ఫలిస్తే మాత్రం బాబుకు గండం పొంచిఉన్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: