ఒడిశా హైకోర్టు తాజాగా ఒక కేసు విషయంలో సంచలన తీర్పును వెల్లడించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో వివాహేతర సంబంధం కొనసాగించడం రేప్ కాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. కొరాపుట్‌ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు విషయంలో కొందరు పెళ్లి చేసుకుంటామని భావించి శారీరకంగా కలుస్తున్నారని... యువకుడు పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తున్నారని... ఇలాంటి ఘటనలను అత్యాచారాలుగా పరిగణించరాదని కోర్టు అభిప్రాయపడింది. 
 
గత సంవత్సరం ఒక యువతి ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక కోరికలు తీర్చుకున్నాడని అతడి కారణంగా గర్భం దాల్చానని ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని అతడిపై రేప్ కేసు పెట్టారు. యువకుడు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు యువకుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ సమ్మతితో శారీరక సంబంధం పెట్టుకోవడం అత్యాచారం కిందకు రాదని కోర్టు ఈ సందర్భంలో పేర్కొంది. 
 
ఈ కోర్టు తీర్పు విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచార కేసుల్లో అక్రమ సంబంధాల కేసులే ఎక్కువగా అత్యాచార కేసులుగా పరిగణించబడుతున్నాయి. మొదట ఇష్టంతోనే శారీరక సంబంధం ఏర్పడినా ఆ తరువాత వివిధ కారణాల వల్ల యువతులు యువకులపై అత్యాచార కేసులు పెడుతున్నారు. ఇలాంటి కేసుల్లో కొన్ని సందర్భాల్లో అబ్బాయిల వైపు తప్పులు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అమ్మాయిల వైపు తప్పులు ఉన్నాయి. 
 
ఒకరిని ప్రేమించి ఆ అబ్బాయి అంతకంటే మంచి ఉద్యోగం వస్తే కేసు పెడతానని బెదిరించి అబ్బాయిలను వదిలించుకునే వాళ్లు కూడా సమాజంలో బోలెడు ఉన్నారు. అబ్బాయిలు కొన్ని సందర్భాల్లో మంచి ఉద్యోగాలు వస్తే ప్రేమించిన అమ్మాయిని వదిలించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. కోర్టు తీర్పును విమర్శిస్తూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ కోర్టు ఈ కేసును అత్యాచారంగా పరిగణించలేమని చెప్పింది కానీ మోసంగా పరిగణించలేమని మాత్రం చెప్పలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: