చంద్రబాబు తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 65 రోజుల పాటు ఇంట్లో ఉండిపోయారు. ఆయన ప్రజలను, పార్టీ నేతలను కలవకుండా ఇంత కాలం ఉండడం అంటే విశేషమే మరి. ఇక మహానాడును ఏపీ గడ్డ మీదనే నిర్వహించాలని బాబు హడావుడిగా ఏపీకి వచ్చారు.

 

సరే బాబు వచ్చారు. ఆయన రాకను స్వాగతిస్తూ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘిస్తూ పార్టీ నాయూకులు చేసిన హడావుడి ఇపుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. చంద్రబాబు వస్తున్న వేళ దారిపోడవునా బారులు తీరి పార్టీ నేతలు స్వాగతం పలికిన తీరు సాధరణ రోజులను గుర్తు చేసింది. ఎటు చూసినా భౌతిక దూరం పాటించకుండా రోడ్లను బ్లాక్ చేస్తూ సాగిన ఈ హోరు బాబుకు ఎంతటి ఆనందం కలిగించిందో తెలియదు కానీ ఏకంగా వైసీపీ నేతలకు అస్త్రాలను ఇచ్చినట్లైంది.

 

వైసీపీ నేతలు దీని మీద కోర్టుకు వెళ్లారు. ఏకంగా ఆ వీడియోలు కూడా కోర్టుకు పంపించి పిటిషన్లు దాఖలు చేశారు. ఇపుడు కోర్టు దీని మీద ఏంచేస్తుందో చూడాలి. కానీ తమ్ముళ్ల అత్యుత్సాహం  వల్లనే బాబుకు ఆదిలోనే అపశకునం ఎదురైందా అన్న దౌట్లు వస్తున్నాయిట. అసలే ఏడాదిగా పార్టీకి రోజులు బాగులేవు.

 

లేకపోతే చరిత్రలో ఎన్నడీ లేనివిధంగా ఘోరపరాజయం ఏంటి, ఏడాదిగా పార్టీ ఎదుగూ బొదుగూ లేకుండా ఉండడమేంటి, ఇక రెండు నెలల పాటు కరోనా వల్ల రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా స్థంబించడం ఏంటి, ఇవన్నీ చూసుకున్నపుడు టీడీపీ జాగ్రత్తగా ఉండాలి. కానీ అధినేతకు క్యాడర్ స్వాగతం పలికిందా లేక కేసులతో స్వాగతం పలుకుతున్నారా అన్నది అర్ధం కావడంలేదుట.

 

మొత్తానికి ఇపుడు దీని మీద వైసీపీ నేతలు మీరు నేరిపిన విద్యయే అంటూ కోర్టుకు వెళ్తున్నారు. మరి కోర్టు ఏం చెబుతుందో చూడాలి. ఇదే పని వైసీపీ నేతలు చేస్తే సీబీఐ విచారణ జరిపించాలా అని కోర్టు ఘాట్ వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: