9 ఏళ్ల పాటు బడా బడా రాజకీయ నేతలతో పొరాడి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న విషయం తెలిసిందే. జగన్ తొలిసారి సీఎం కావడంతో, 14 ఏళ్ళు సీఎంగా పని చేసిన చంద్రబాబు ప్రతి స్టెప్‌లోనూ వైసీపీ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడానికే చూశారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించి, దానిపై రాజకీయం చేసి, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారనే విధంగా ప్రచారం చేశారు.

 

చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు, టీడీపీ సోషల్ మీడియా వారు జగన్‌పై విష ప్రచారం చేస్తూ వచ్చారు. ఇటీవల కరోనా ప్రభావం ఉన్న సమయంలో కూడా ఎంత చేయాలో అంత చేశారు. ప్రతి విషయంపైన రాజకీయం చేస్తూ వచ్చారు. ఇక టీడీపీ చేసిన నెగిటివ్ ప్రచారం ప్రజల్లోకి కూడా వెళ్లింది. దీంతో కొన్ని వర్గాల ప్రజలు ఒకో సమయంలో కన్ఫ్యూజ్‌కు గురయ్యి, జగన్ ప్రభుత్వం పట్ల నెగిటివ్ గానే స్పందించారు. పైగా హైకోర్టులో కూడా అనేక సార్లు ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం కూడా ఇబ్బందిగానే మారింది.

 

అయితే తమ ప్రభుత్వంపై ఎంత విష ప్రచారం చేసిన జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాసరే ప్రజలకు చేయాల్సింది చేస్తూనే వచ్చారు. ఏపీ రాజకీయ చరిత్రలో ఏ సీఎం అందివ్వని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. ఇటీవల కూడా కరోనా, లాక్ డౌన్ వల్ల్ ఆర్ధిక పరిస్తితి కుంటుపడిన ప్రజలకు సంక్షేమం అందించడంలో వెనక్కి తగ్గలేదు.

 

సున్నా వడ్డీ, ఫీజురీఎంబర్స్‌మెంట్, రైతు భరోసా, ఆటో వాళ్ళకు సాయం..త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీ, పెన్షన్ రూ.250 పెంపు చేస్తున్నారు. ఇలా అన్నీ రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఒక్క సంవత్సరంలో లెక్కలేని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. ఇక ఈ విషయాన్ని ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, తమ కోసం జగన్ కష్టపడుతున్నారని అర్ధం చేసుకుంటున్నారు. దాని వల్ల టీడీపీ చేసిన నెగిటివ్ పక్కకు వెళ్ళి, జగన్‌పై పాజిటివ్ పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: