జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీజీపీగా గౌతమ్ సవాంగ్ ని నియమించడం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం లో డీజీపీ గా వ్యవహరించిన ఏబి  వెంకటేశ్వర్లు పనితీరు సరిగా లేనందువల్ల గౌతమ్ సవాంగ్ ని నియమించడం జరిగింది అని స్వయంగా జగన్ ప్రకటించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన గౌతమ్ సవాంగ్ పదవిలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఈ సమయంలో ఆయన పనితీరుపై ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర రాజకీయాలలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నడూలేని విధంగా జగన్ అధికారంలోకి వచ్చాక పోలీస్ వ్యవస్థ కి న్యాయస్థానంలో మొట్టికాయలు పడ్డాయని దిగజారిన పరిస్థితి కనిపిస్తోందని సీనియర్ పోలీసులు అనుకుంటున్నారు.

 

రాజధాని అమరావతి దీక్షా సమయంలో రైతులపై మహిళలపై వేధింపుల కేసుల విషయంలో ఏపీ పోలీసుల వ్యవస్థపై కేసులు హైకోర్టు లో ఉండటం దీనికి నిదర్శనం అని అంటున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో ప్రజలపై మితిమీరి వ్యవహరించి చితకబాదిన పరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచే అప్పట్లో ఆగ్రహావేశాలు తీవ్ర స్థాయిలో రావటం కూడా దీనికి నిదర్శనమని సీనియర్ పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క చంద్రబాబు విశాఖ పర్యటన సమయంలో ఆయన ను అడ్డుకున్న తీరును హైకోర్టు తీవ్రస్థాయిలో ఏపీ పోలీసుల పనితీరుపై సీరియస్ అవటం కూడా పోలీస్ వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అని అంటున్నారు.

 

ఓవరాల్ గా చూసుకుంటే పోలీస్ బాస్ లో ఉన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ పనితీరు పెద్దగా చెప్పుకునే విధంగా లేదు అని సీనియర్ పోలీసు అధికారుల నుండే టాక్ వినపడుతోంది. అయితే మరికొంత మంది పోలీసు వ్యవస్థపై గౌరవంగా మాట్లాడుతూ ఇదంతా పొలిటికల్ లీడర్ల పర్యవేక్షణలో జరిగిన గొడవలు. దీనికి గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఉంటున్నారు. ఏదైనా పైన ప్రభుత్వం నుండి వచ్చే ఆదేశాలను డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు అమలు చేస్తారు. మరి అలాంటి విషయాలలో గౌతమ్ సవాంగ్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పోలీస్ వ్యవస్థ ను సపోర్ట్ చేస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: