కేరళలో కథ మళ్ళీ మొదటికొచ్చింది. గత కొద్దీ రోజులనుండి అక్కడ భారీ సంఖ్య లో కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు ఏకంగా రాష్ట్రంలో 67కేసులు నమోదయ్యినట్లు  సీఎం పినరయ్ విజయన్ వెల్లడించారు. సింగల్ డే  లో ఇప్పటివరకు అక్కడ ఇదే హైయెస్ట్. ఇందులో 7 కాంటాక్ట్ కేసులు కాగా మిగతావి విదేశాల నుండి వచ్చినవారివి.  ఈ కొత్త కేసుల తో కలిపి  కేరళ లో మొత్తం కేసుల సంఖ్య 963కు చేరగా అందులో 542మంది బాధితులు కోలుకోగా ఆరుగురు మరణించారు. ప్రస్తుతం 415 కేసులు యాక్టీవ్ గా వున్నాయి.
ఇక మిగితా రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడు లో ఈరోజు కొత్తగా  648 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 17728కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 48కేసులు నమోదు కాగా తెలంగాణ లో  71కేసులు బయటపడ్డాయి అలాగే ఒకరు మరణించారు.  రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 57కి చేరింది. ఓవరాల్ గా దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 150000 దాటింది. మరో 5రోజుల్లో నాలుగో దశ లాక్ డౌన్ కూడా ముగియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: