ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయాలపై, పథకాలపై వైసీపీ విమర్శలు చేయగా 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ విషయంలో టీడీపీ అదే విధంగా వ్యవహరిస్తొంది. అయితే తాజాగా సీఎం జగన్ టీడీపీకి భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
 
తాజాగా జగన్ చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి వ్యతిరేకంగా ఉండగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇస్తే మాత్రం టీడీపీ ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. అయితే టీడీపీ వీరి విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాల ప్రకారం టీడీపీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నా చంద్రబాబుకు ఎటువంటి నష్టం కలగదని తెలుస్తోంది. 
 
అయితే వైసీపీ మాత్రం భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను టీడీపీకి దూరం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కుల పరంగా, ఆర్థిక పరంగా, చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే నాయకులను టీడీపీకి దూరం చేయాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చి చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. 
 
టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వచ్చినా వారు వైసీపీలో చేరాలంటే మాత్రం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకు టీడీపీ నాయకులు అంగీకరించడం కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉండగా మరికొంతమంది ఎమ్మెల్యేలను బయటకు లాగితే మాత్రం జగన్ పరోక్షంగా చంద్రబాబును దెబ్బ తీసినట్టే అని చెప్పవచ్చు.             

మరింత సమాచారం తెలుసుకోండి: