ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అర్చకులకు, ఇమాంలకు, పాస్టర్లకు 5,000 రూపాయల చొప్పున ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తున్నామని ప్రకటించింది. ఈ 5,000 రూపాయల లెక్క విషయంలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. 2011 లెక్కల ప్రకారం ఏపీలో 88.46 శాతం, ముస్లింలు 9.56 శాతం, క్రిస్టియన్లు 1.34 శాతం ఉన్నారు. 
 
కానీ రాష్ట్రంలో అర్చకుల సంఖ్యకు సమానంగా పాస్టర్ల సంఖ్య కూడా ఉంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో పాస్టర్లు ఉండటంపై పలువురు సోషల్ మీడియా వేదికగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అర్చకులతో సమానంగా పాస్టర్లు ఉండటంపై కొందరు చాలా లెక్కలు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చి లాక్ డౌన్ సమయంలో వారిని ఆదుకోవడంపై మాత్రం ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 
 
పాస్టర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంపై పలువురు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలకు ప్రభుత్వం స్పష్టత ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు జగన్ సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లు, మౌజంల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేశారు. ప్రభుత్వం వీరి కోసం 38 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించింది. 
 
కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఆదాయం లేక అర్చకులు పాస్టర్లు, ఇమాంలు ఇబ్బందులు పడుతూ ఉండటంతో ప్రభుత్వం వీరికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం గతంలోనే అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజం‌లను ఆదుకోవాలని నిర్ణయం తీసుకోగా తాజాగా ఆ నిర్ణయాన్ని అమలు చేసింది. వన్‌టైం సహాయం కింద రూ. 5 వేల నగదును ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలలో జమ చేసింది.               

మరింత సమాచారం తెలుసుకోండి: