తిరుమల శ్రీవారి ఆస్తుల అమ్మకం వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. మొదట్లో తమిళనాడులోని శ్రీవారి నిరర్థక ఆస్తులను వేలం వేయాలన్న టీటీడీ నిర్ణయంతో తేనెతుట్టె కదిలింది. దీన్ని విపక్షాలు అందుకున్నాయి. శ్రీవారి ఆస్తులన్నీ అమ్మేస్తున్నారన్న రేంజ్ లో విమర్శలు గుప్పించాయి. తిరుపతి వెంకన్నకు సంబంధించిన విషయం ఏదైనా భక్తుల సెంటమెంట్ తో ముడిపడి ఉంటుంది కనుక సహజంగానే ఈ విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యింది.

 

 

జగన్ సర్కారు అనవసరంగా ఈ తేనెతుట్టెను కదిపిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఆ తర్వాత కానీ అసలు విషయాలు వెలుగు చూడలేదు. ఇదేమీ కొత్త నిర్ణయం కాదని చంద్రబాబు హయాంలో చేసిన తీర్మానం అమలు చేయడంతోనే ఈ రచ్చ మొదలైందని తెలిసింది. దీంతో వైసీపీ నేతలు కూడా విపక్షాలపై విరుచుకుపడ్డారు. అయితే గత ప్రభుత్వం తప్పు చేస్తే మీరు దాన్ని కొనసాగిస్తారా అన్న ఎదురుదాడి మొదలైంది. దీంతో అసలు ఎందుకొచ్చిన గొడవ అని ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగంది. నిర్ణయాన్ని ఆపేసింది.

 

 

ప్రభుత్వం శ్రీవారి ఆస్తుల అమ్మకం నిర్ణయాన్ని ఆపేసినా విమర్శలు, ప్రతి విమర్శలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై పూర్తి స్థాయిలో ఆడిట్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అది కూడా ఎన్టీఆర్ కాలం నుంచి ఈరోజు వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాలు, ఆదాయం, ఖర్చులపై జాతీయ స్థాయిలో ఆడిట్ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. నిజంగా ఈ ఆడిట్ జరిగితే చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు ఏమైనా ఉంటే బయటపడే అవకాశం ఉంది. మరి దీనికి జగన్ సర్కారు ఏమంటుందో చూడాలి. ఏదేమైనా శ్రీవారి ఆస్తుల అంశం మాత్రం రాజకీయాల్లో పెను దుమారమే లేపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: