ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ఇండియాలో ఉన్న కొద్ది బలపడుతోంది. వైరస్ కి ఇంకా మెడిసిన్ మరియు వ్యాక్సిన్ రాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తూ సరికొత్త సడలింపులు ఇవ్వటంతో ఇండియాలో రోజుకి దాదాపు 5 వేల నుంచి ఆరువేల మధ్యలో కేసులు బయట పడుతున్నాయి. ఈ విధంగా వైరస్ వ్యాపించడానికి కారణం చూస్తే వలస కూలీలు అని తేలింది. ఇటీవల వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్ళటానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సొంత ఊళ్లకు బయలుదేరారు.

 

కేంద్రం ప్రత్యేకమైన రైళ్లు పెట్టడం ద్వారా మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ బస్సులు ద్వారా వలస కూలీల ను గమ్యస్థానాలకు చేరారు. ఈ దెబ్బతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయంకరంగా వ్యాపించి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమయంలో ఒకపక్క కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నా మరోపక్క కేంద్రం మాత్రం చాలా విషయాలకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకొంటోంది. ఇటీవల మే 25వ తారీకు నుంచి దేశీయ విమానాలు తిప్పుకోవడానికి అనుమతులు ఇచ్చిన కేంద్రం త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల తలుపులు తెరవటానికి అనుమతులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కేంద్రం సంగతేమో గానీ కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి ఆలయాల గుడి తలుపులు తెరుచుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

 

జూన్ ఒకటో తారీకు నుంచి గుడి తలుపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దేశంలో ఆలయాలకు ఓపెన్ చేసుకోవచ్చని అవకాశం ఇచ్చిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నమోదు అయ్యింది. ఇదే సమయంలో సోషల్ డిస్టెన్స్ మరియు మాస్కులు ధరించి నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. జూలై మాసం నుండి స్కూల్స్ మరియు కాలేజీలు కూడా ఓపెన్ చేయబోతున్నట్లు కర్ణాటక సర్కార్ తెలియజేసింది. మొత్తంమీద చాలా రోజుల తర్వాత జూన్ మాసంలో ఆలయాలు ఓపెన్ అవుతున్న తరుణంలో చాలామంది భక్తులలో సంతోషం నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: