దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కరోనా గురించి, వ్యాక్సిన్ గురించి, ఇతర విషయాల గురించి పరిశోధనలు చేస్తున్నారు. 
 
శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మాస్క్ ధరించినా భౌతిక దూరం పాటించకపోతే కరోన భారీన పడే అవకాశాలు ఉన్నట్టు తేలింది. కరోనా వైరస్ భారీన పడకుండా ఉండాలంటే ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య ఆరు అడుగుల కనీస దూరం ఉండాలి. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడంతో పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. 
 
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) భౌతిక దూరం పాటించకుండా మాస్క్ ధరించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పింది. ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది. తాజాగా సీడీసీ మరోసారి కరోనా వైరస్ నియంత్రణ కొరకు మార్గదర్శకాలను జారీ చేసింది. సీడీసీ చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు కనిపించడం లేదని... వారి వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. 
 
కరోనా లక్షణాలు లేవని భావించి ఎవరితోనైనా సన్నిహితంగా మెలిగితే కరోనా సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండేళ్ల లోపు పిల్లలు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు మాస్క్ ధరించకపోవడమే మంచిదని దీర్ఘ కాలిక వ్యాధుల వల్ల బాధ పడేవారు వైరస్ కు త్వరగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. రోజూ మనం తాకే వస్తువులను, ఉపరితలాలను కెమికల్ స్ప్రే చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: