దేశంలో కరోనా వైరస్ ప్రబలి పోతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కట్టుదిట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులు తమ మంత్రి వర్గం, అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర పరిస్థితితులపై సమగ్ర సమాచారం తీసుకొని వాటి పరిష్కారం కోసం మార్గాలు నిర్ధేషిస్తున్నారు. తాజాగా తెలంగాణ‌లో క‌రోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 2 వేల‌కు చేరువైంది. గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా 71 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసులు 1991కి చేరాయి. మంగ‌ళ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ రోజువారీ బులిటెన్ ను విడుద‌ల చేసింది. ఇవాళ అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 38 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.   

 

మొన్నటి వరకు పలు జిల్లాల్లో సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు మళ్లీ కరోనా తన ప్రతాపం చూపిస్తుంది.   రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చ‌ల్ 6, సూర్యాపేట్, వికారాబాద్, న‌ల్ల‌గొండ‌, నారాయ‌ణపేట్ జిల్లాల్లో ఒక్కొక్క‌టి చొప్పున కొత్త కేసులు వ‌చ్చాయి. గ‌డిచిన 14 రోజులుగా కొత్త కేసులు న‌మోదు కాని జిల్లాల సంఖ్య 21కి త‌గ్గింది. అలాగే 12 మంది వ‌ల‌స కార్మికుల‌కు, ఇటీవ‌ల విదేశాల నుంచి తిరిగొచ్చిన న‌లుగురికి పాజిటివ్ వ‌చ్చింది. గ‌డిచిన 24 గంట‌ల్లో భారీగా క‌రోనా పేషెంట్లు రివ‌క‌రీ అయ్యారు.

 

ఒక్క రోజులో 120 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1284కు చేరింది. జిహెచ్ఎంసీ (GHMC ) పరిధిలోనే అత్యధికంగా 38 కరోనా కేసులున్నాయి. మరో 12 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి కరోనా సోకింది.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మరోసారి సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితులపై సమీక్షంచనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: