76 సంవత్సరాలుగా ఎటువంటి ఆహారము, నీరు ముట్టకుండా సైన్సు కు సైతం సవాల్ విసిరిన 90 సంవత్సరాల యోగి ప్రహల్లాద మంగళవారం ఉదయం కన్నుమూశారు. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లా రోడ్ గ్రామానికి చెందిన ప్రహల్లాద జానీ కేవలం ఆయన శ్వాస తీసుకోవడం ద్వారా మాత్రమే జీవిస్తూ ఉన్నారు. భక్తులందరూ ఆయన్ని చునిర్వాలా మాతాజీ అని పిలుస్తారు. ఆయన నిజానికి వైద్యులను, పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు అనేక మంది వైద్యులు ఆయన పై పరిశోధనలు జరిపారు కానీ ఆయన లో దాగి ఉన్న రహస్యంని మాత్రం తెలుసుకోలేకపోయారు.

IHG


ఈ విషయంపై దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఈయన రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. 2010 సంవత్సరంలో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆ స్వామీజీ ని పూర్తిగా పరీక్షించారు. అంతే కాదు ఆయనను 15 రోజుల పాటు ఒంటరిగా ఉంచి చుట్టూ కెమెరాలు పెట్టి ఆయన జీవన శైలి పై పూర్తిగా నిఘా పెట్టారు. అంతేకాకుండా వైద్యరంగంలో వుండే అల్ట్రాసౌండ్, MRI, సిటీ స్కాన్ వంటి అనేక రకాల ఆధునిక పరీక్షలు ఆయనకు చేశారు.

 

ఇక చివరికి ఆయన సాధారణ వ్యక్తి కాదని వైద్యులు తేల్చారు. ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలు ఆయనలో ఉన్నాయని వారు గుర్తించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని రెండు రోజులపాటు బనస్కంతలోని ఆయన ఆశ్రమంలో భక్తుల సందర్శనార్థం కోసం అక్కడ ఉంచారు. మే 28 అనగా గురువారం నాడు అదే ఆశ్రమంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. నిజంగా తను 78 సంవత్సరాలుగా ఆహారం మీరు లేకుండా ఎలా జీవించారో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి: