ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  అమలులో ఉన్నప్పటికీ చాలా మంది వివాహం చేసుకునేందుకు మాత్రం వెనుకాడడం లేదు. లాక్ డౌన్ నిబంధనలు  సంపూర్ణంగా అమలులో ఉన్నప్పటికీ కూడా చాలామంది తమ వివాహాన్ని మాత్రం వాయిదా వేసుకోకుండా... వీడియో కాల్ ద్వారానే వివాహం చేసుకుంటున్న  విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ సడలింపు ఇస్తున్న నేపథ్యంలో...కొంతమంది నిరాడంబరంగానే సాదాసీదాగా పెళ్లి చేసుకుంటే.. కొంతమంది వినూత్నంగా ఆలోచించి సరికొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఎవరు మాత్రం పెళ్లిని వాయిదా వేసుకునేందుకు మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఇలాంటిదే జరిగింది.వినూత్న రీతిలో పెళ్లి చేసుకున్నారు ఓ జంట. 

 

 ఇక తాజాగా పెళ్లితో ఒక్కటయిన  జంట ఈ క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. కేరళకు చెందిన విగ్నేష్ అంజలి పూణేలో పనిచేస్తుండగా... వారికి గత సంవత్సరమే వివాహం నిశ్చయమైంది. ఇక వీరి వివాహం నిమిత్తం స్వస్థలానికి వెళ్లే సమయానికి... ఈ దేశంలో లాక్డౌన్ నిబంధనలు అమలు లోకి వచ్చాయి. అయినప్పటికీ ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే పెళ్లి జరగాలని భావించారు ఈ జంట. అయితే పూణే లో కేవలం వధూవరులు మాత్రమే ఉన్నారు. ఇక ప్రస్తుతం బంధువులు ఎవరూ అక్కడికి వెళ్లే అవకాశం కూడా లేకపోయింది. 

 

 

 ఎలాగైనా ముందుగా అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట స్నేహితులతో కలిసి వివాహ ఏర్పాట్లు చేసుకున్నారు... వీరిద్దరు తల్లిదండ్రులు కేరళ నుంచి మంగళసూత్రాన్ని పోస్టల్ శాఖ ద్వారా పంపించారు. ఇక స్పీడ్ పోస్ట్ లో తాళిబొట్టు పంపించడంతో ఇండియన్ పోస్టల్ శాఖ సమయానికి ఈ తాళిబొట్టు  అందించారు. ఇక వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో జరుపుకున్నారు. జూమ్  యాప్ లో బంధువులంతా తిలకించి ఆశీర్వదించగా... తమ దగ్గరి బంధువులు స్నేహితులు పెళ్లిని తిలకించారు అంటూ చెప్పుకొచ్చింది ఈ జంట.

మరింత సమాచారం తెలుసుకోండి: