గత కొంతకాలంగా వైసీపీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా అధికార పార్టీ నేతల మధ్య మరోసారి అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఓవైపు తెర మీద మా మధ్య వివాదాలు లేవు అని చెప్పుకుంటూనే మరోవైపు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వైసీపీ లోకి  రాజకీయం వేడెక్కింది . డిప్యూటీ సీఎం నారాయణస్వామి... ఎమ్మెల్యే రోజా ల మధ్య అంతర్గతంగా విభేదాలు తలెత్తాయి అనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే రోజా కు సమాచారం ఇవ్వకుండా డిప్యూటీ సీఎం నారాయణస్వామి నగరి నియోజకవర్గంలో పర్యటించడం ప్రస్తుతం ఇద్దరి  మధ్య విభేదాలకు కారణమైంది అని తెలుస్తోంది. దీంతో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు కాస్త అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. 

 


 అసలేం జరిగింది అంటే... నగరి నియోజకవర్గం పరిధిలో ఉన్న... పుత్తూరు దళితవాడలో కళ్యాణ మండపం నిర్మించాలని నిర్ణయించారు అధికారులు. పుత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న తోట్రవాణిగొంతులో ఉన్న స్థలాన్ని అంబేద్కర్ ట్రస్టుకు అప్పగిస్తే అందులో ఎస్సీ ఎస్టీల కోసం అంబేద్కర్ పేరిట కల్యాణ మండపాన్ని కట్టుకుందామని సత్యవేడు ఎమ్మెల్యే అయిన ఆదిమూలం ప్రతిపాదించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎమ్మెల్యే ఆదిమూలం ను  వెంటబెట్టుకుని సంబంధిత స్థలాన్ని పరిశీలించటానికి  వెళ్లారు. అయితే ఈ పర్యటన పై ఎమ్మెల్యే రోజా కి సమాచారం ఇవ్వకపోవడం తో ఎమ్మెల్యే రోజా వర్గానికి కాస్త కోపం తెప్పించింది అనే టాక్ కూడా వినిపిస్తోంది. 

 


 అయితే దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రోజా ఎస్సీల కోసం కళ్యాణ మండపం కట్టడం మంచి విషయమని.. కానీ ఈ పర్యటనకు తనను  కూడా పిలిస్తే గౌరవంగా భావించే దానిని అని అంటూ పలు వ్యాఖ్యలు చేశారట ఎమ్మెల్యే రోజా. ఇక దీనిపై ఏకంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందిస్తూ తనకు ఎమ్మెల్యే రోజా కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని రోజా తన సోదరి లాంటిది అంటూ చెప్పుకొచ్చారు. తాము కలిసే పనిచేస్తున్నామని దీనిపై అనుచరులు బాధపడడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ బాధ పడిన అనుచరులు ఎవరో ఒకసారి తన ముందుకు రావాలంటూ చెప్పుకొచ్చారూ . అయితే ఇద్దరూ ఒకరితో ఒకరికి విభేదాలు లేవు అని తెరమీదికి చెబుతున్నప్పటికీ లోపల్లోపల మాత్రం కౌంటర్లు ఇచ్చుకుంటూనే  ఉంటున్నారు అని ప్రస్తుతం అధికార పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: