ఈ మద్య దేశంలో ఎన్నో చిత్రాలు.. విచిత్రాలు జరుగుతున్నాయి.  అయితె తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విచిత్రాలు జరిగినా అది ఏనాడో బ్రహ్మంగారు చెప్పారు.. ఇప్పుడు జరుగుతుందని అంటున్నారు.  కరోనా కూడా కోరంగి వ్యాధి వస్తుందని.. కోటి మంది ప్రాణాలు పోవడం తధ్యం అని ఉందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.  తాజాగా కోడి గుడ్డు సొన సహజంగా పసుపు కలర్ లో ఉంటుంది.. దాని రంగులో ఏమాత్రం మార్పు వచ్చినా.. గుడు మురిగిపోయిందని అంటారు.  తాజాగా  కేరళలోని మలప్పురంలో ఆకుపచ్చ సొన ఉన్న కోడిగుడ్లు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. సామాన్యులతోపాటు సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒతుక్కుంగల్‌లోని ఏకే షిహాబుద్దీన్‌ అనే రైతు వద్ద ఉన్న కోళ్లలో ఆరు కోళ్లు కొంతకాలంగా ఆకుపచ్చ సొన ఉన్న గుడ్డు పెడుతున్నాయి.

 

దీనిపై సోషల్ మీడియాలో రక రకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఇది ఆ నోటా.. ఈ నోటా వినడం.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఏం జరిగిందనేది ఎవరికి అంతు చిక్కకపోవడంతోదీంతో శాస్త్రవేత్తలు  రంగంలోకి దిగి ఆ గుట్టు ఏంటో తేల్చేశారు.  మలప్పురంలో షిహాబుద్దీన్‌ అనే రైతు వద్ద ఉన్న కోళ్లను కేవీఏఎస్‌యూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ తర్వాత వాటిపై పరీక్షలు జరిపారు.  కోళ్లకు పెట్టిన ఆహారం వల్ల గానీ సహజసిద్ధమైన రంగునిచ్చే మొక్కలను తినడం వల్ల గానీ గుడ్లలోని సొనలో ఈ మార్పు కనిపించి ఉంటుందని తేల్చారు.

 

అయితే ఆ కోళ్లకు జన్యులోపం ఏమాత్రం లేదని.. సాధారణ కోళ్లమాదిరిగానే ఉన్నాయని అన్నారు. రైతు వాటికి పెట్టే ఆహారం మార్చడంతో కేవలం రెండు వారాల్లోనే పసుపు రంగులోకి మారాయని అన్నారు. ఇలాంటి గుడ్లు చాలా రోజులుగా గమణిస్తున్నామని, కానీ సోషల్ మీడియా కారణంగా ఇటీవల ఇవి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినట్టు పేర్కొన్నారు. మొత్తానికి ఈ గుడ్ల మిస్టరీ వీడటంతో జనాలు ఊపరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: