దేశంలో ఓ వైపు కరోనా కష్టాలు అనకుంటే మరోవైపు బీభత్సమైన ఎండలతో తల్లడిల్లి పోతున్నారు.  ఇప్పటికే రెండు నెలలుగా కరోనా మహమ్మారి ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగింది.. దాంతో వలస కూలీలు ఎక్కడిక్కడ బందీ అయ్యారు.  ఈ మద్య వలస కూలీలపై ఆంక్షలు తొలగిపోవడంతో ఎవరి గమ్యస్థానానికి వారు వెళ్తున్నారు.  పనులు లేక తినేందుకు తిండి లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఇక్కడే కొత్త చిక్కులొచ్చి పడుతున్నాయి. ప్రయాణాలకు అగుణంగా రవాణా వ్యవస్థ లేదు.. శ్రామిక్ రైళ్లు, కొన్ని బస్సులు ఉన్నా.. వాటిలో పూర్తి స్థాయి ప్రజలు పోలేకపోతున్నారు.  ఇంటికి ఎప్పుడు పోతామా అని రైల్వే స్టేషన్ల దగ్గర, కరోనా స్క్రీనింగ్‌ సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నరు.  దాంతో కాలినడకనే ప్రయాణిస్తున్నారు.. ఇప్పుడు ఇదే వలస కూలీలకు శాపంగా మారింది. ఇంటికి వెళ్లేకంటే ముందే ఆకలితో.. ఎండ దెబ్బకు చచ్చిపోతామేమో అని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

 

పిల్లలు, పెద్దలు, ముసలోళ్లు, గర్భిణిలు కూడా గంటల పాటు స్క్రీనింగ్‌ కోసం లైన్‌లో నిలబడుతున్నారని అన్నారు. ఆకలితో ఇక్కడ ఇలాగే చచ్చిపోతామేమో... అన్నంత భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వలస కూలీలు. నిన్న పొద్దునంతా ఇక్కడే ఉన్నాను. ట్రైన్‌ లేదు. మేం వెళ్లాల్సిన రైలు పొద్దునే బయలుదేరుతుంది అని అర్ధరాత్రి దాటాక మెసేజ్‌ వచ్చింది. మెసేజ్‌ చూసుకుని వచ్చే సరికి రైలు వెళ్లిపోయింది. కీనీసం తినేందుకు తిండి లేదు. డబ్బులు లేవు ఆకలితో, ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం అంటూ చాలా మంది వలస కూలీలు కన్నీరు పెట్టుకుంటున్నారు.

 

ప్రోటోకాల్‌ ప్రకారం శ్రామిక్‌ రైలులో వెళ్లేందుకు రిజిస్టర్‌‌ చేసుకున్న వారికి ఒక రోజు ముందు మెసేజ్‌ ఇవ్వాలి. వాళ్లంతా స్క్రీనింగ్‌ సెంటర్లకు వచ్చి పరీక్షలు చేయించుకున్న తర్వాత రైళ్లలోకి అనుమతిస్తారు. అయితే తమకు మెసేజ్‌లు రావడం లేదని, ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు మెసేజ్‌లు వస్తున్నాయని, దాని వల్ల టైమింగ్స్‌ తెలుసుకోలేగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: