లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చినప్పటి నుంచి, వలస కార్మికుల పాలిట అది శాపంగా మారింది. ఒకవైపు కరోనాను కట్టడి చేసే విషయంలో కేంద్రం ఏం చేయాలో దిక్కుతోచని ఈ పరిస్థితుల్లో ఉండగా, మరోవైపు వలస కార్మికులు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఉన్న చోట ఉపాధి కరువై, ఆకలికి అలమటించే పరిస్థితి ఉండడంతో చాలామంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం కధనాలు రావడం తో కేంద్రం అభాసుపాలవుతూ వస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను తీసుకువెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా, రోడ్లపై నడక బాట పట్టిన వారు లక్షల్లో ఉన్నారు. తమ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వారు ఎన్నో వ్యయప్రయాసలు పడుతూనే ముందుకు వెళ్తున్నారు. 

 

IHG


ఈ విషయంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. వలస కార్మికుల ఇబ్బందులపై తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వలస కార్మికుల దుస్థితి పై కేంద్రం, రాష్ట్రాలు జోక్యం చేసుకునేలా చూడాలని వారికి వెంటనే ఉపాధి కల్పించే విధంగా తగిన ప్రణాళిక చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు దీనికి సంబంధించిన విచారణను అత్యవసరంగా చేపట్టాలని పిటిషనర్ కోరారు.

 

IHG


 ఇప్పటికే వలస కార్మికులకు షెల్టార్లు, భోజన సదుపాయం కల్పించి అందరిని వారి వారి స్వస్థలాలకు తరలించాలని ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్ కేంద్రానికి రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో 48 గంటల్లో తమకు తెలియ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఇదే అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అవ్వడంతో మరోసారి దీనిపై సుప్రీం కోర్ట్ ఏ విధంగా స్పందిస్తుందో అనేది ఆసక్తి కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: