అదేదో సినిమాలో చిరంజీవి పాత్ర అంటుంది. తనకు నచ్చని పదం క్షమాపణ అని.  అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకు గిట్టని పదని రాజీనామా.  ఆయన ఎంతసేపు ఎదుటివారి రాజీనామాలే అడుగుతారు తప్ప తాను మాత్రం రాజీనామా చేయరు. అసలు అటువంటి సవాళ్ళకు ఆయన బహు దూరం. విన్నా వినిపించుకోనట్లుగా ఉంటారు.

 

అటువంటి బాబును రాజీనామా చేయమని అడుగుతున్నారు వైసీపీ మంత్రి, నిన్నటి టీడీపీ తమ్ముడు అవంతి శ్రీనివాస్. ఆయన చంద్రబాబును గట్టిగానే సవాల్ చేశారు. విశాఖలో భూములు కబ్జా అయ్యాయంటున్న చంద్రబాబు వాటిని నిరూపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

 

ఇక గజం స్థలం కబ్జా అయిందని తెలిసినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా చెబుతున్నారు. మరి బాబు ఈ సవాల్ ని స్వీకరిస్తారా అంటే ఆ మాత్రం రాజకీయం తెలిసిన వారు చెప్పే మాట. ఆయన అసలు స్వీకరించరు అని. ఇదిలా ఉండగా మహానాడులో టీడీపీ ఓటమి గురించి చర్చించాలట.

 

అది కూడా జరిగే పని కాదు, తాము ఓడిపోలేదు, ఇంకా అధికారంలో ఉన్నామని టీడీపీ పెద్దలు భావిస్తూంటే మానసికంగా బాగా క్రుంగదీసిన ఆ దారుణమైన  ఓటమి గురించి పదే పదే తలచుకోమనడం కూడా ధరం కదేమో. ఏది ఏమైనా మహానాడు పేరు పెట్టి జగన్ సర్కార్ని మరో మారు తిట్టాలని టీడీపీ అనుకుంటున్నపుడు వారి ఆనందం వారిది. మధ్యలో అజెండా సెట్ చేసే అధికారం  ఎవరికీ లేదుకదా. 

 

ఇక విశాఖ భూముల దందా గురించి టీడీపీ వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. ఇది సవాళ్ళూ, ప్రతి సవాళ్ల దాక వెళ్లాల్సిన అవసరం లేదు కూడా.ఎవరేంటి అన్నది జనాలకు బాగా తెలుసు. ఏది ఏమైనా బాబును రాజీనామా చేయమనడం మాత్రం తమ్ముళ్ళు తట్టుకోలేని సవాలేమో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: