దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా, ప్రజల ఇబ్బందులు, రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే ఆ సడలింపులతో మరికొన్ని కొత్త కొత్త కేసులు నమోదు అవుతుండడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ 4.0 మే 31 తో ముగుస్తున్న నేపథ్యంలో, అదే రోజు మన్ కీ బాత్ పేరుతో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకపక్క లాక్ డౌన్ అమలు అవుతున్న సమయంలోనే అనేక సడలింపులు ఇస్తూ కేంద్రం ముందుకు వెళ్తోంది. కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం, లాక్ డౌన్  4.0 గడువు ముగుస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ 5 .0 ను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 70 శాతం కేసులు కేవలం కొన్ని నగరాల్లోనే నమోదవుతుండడాన్ని కేంద్రం గుర్తించింది. 

 

IHG' -- Govt Motto On Corona, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MODI' target='_blank' title='modi- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>modi</a> Tells CMs


ఈ మేరకు 11 నగరాలపై 5.0 ను కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖ వర్గాలు ఆలోచిస్తున్నాయి. జూన్ 1 నుంచి లాక్ డౌన్ 5.0 మొదలయ్యే నగరాలుగా ఢిల్లీ ముంబై బెంగళూరు పుణె, థానే , ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్ కతా నగరాల్లో కరోనా కట్టడిపై ఫోకస్ చేయాలని చూస్తోంది. దేశవ్యాప్తంగా నమోదైన 1.51 లక్షల కరోనా కేసుల్లో 80 శాతం కేసులు నగరాల్లోనే నమోదవుతున్న నేపథ్యంలో 30 మున్సిపల్ కార్పొరేషన్ లతో కూడిన జాబితాను కేంద్రం సిద్ధం చేసుకుంది. ఇక లాక్ డౌన్ 5.0 లో మిగతా నగరాల్లో భారీ సడలింపులు ఇచ్చే విధంగా కేంద్రం ముందుకు వెళ్తోంది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పరిశీలిస్తోంది. 

 


 ప్రార్థన మందిరాల వద్ద ప్రజలు భారీ ఎత్తున గుమిగూడడం నిషేధిస్తూ కఠిన నిబంధనలు విధించి అప్పుడు వీటిని అనుమతించాలని కేంద్రం భావిస్తోందట. అలాగే ప్రార్ధన స్థలాల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయాలనే మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన జూన్ ఒకటో తేదీ నుంచి అన్ని ప్రార్ధన స్థలాలను తెరిచేందుకు అనుమతించాలన్నదే కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరికొద్ది రోజుల్లోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: