ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి చంద్రబాబు జగన్ సర్కార్ కు పరీక్షలు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలకు అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. తాజాగా మరికొన్ని పరీక్షలు జగన్ ఎదుర్కోవాల్సి ఉంది. అందులో ఒకటి శాసనమండలి. శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. 
 
అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారంపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వేసిన పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. 8 మందితో సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ శాసన మండలి తీర్మానం చేసినా కమిటీ ఏర్పాటు చేయలేదని దీపక్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. మండలి కార్యదర్శి సెలక్ట్ కమిటీ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్ విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందో చూడాల్సి ఉంది. సీఆర్డీఏ భూములకు సంబంధించి మరో వివాదం నడుస్తోంది. సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులపై విచారణ జరగాల్సి ఉంది. మండలి ఛైర్మన్ ఆదేశాల గురించి హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ప్రభుత్వ భూముల విక్రయానికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. 
 
తాజాగా హైకోర్టు ప్రభుత్వం దివాళా తీసిందా...? అంటూ ఈ పిటిషన్ విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్తులు అమ్మడం ద్వారా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని భావిస్తుందా...? అంటూ ప్రశ్నించింది. చంద్రబాబు తన సన్నిహిత నేతల ద్వారా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయిస్తున్నారు. మరి ఈ పిటిషన్ల విషయంలో జగన్ సర్కార్ కు అనుకూలంగా తీర్పులు వస్తాయో వ్యతిరేకంగా తీర్పులు వస్తాయో చూడాల్సి ఉంది.    
 

మరింత సమాచారం తెలుసుకోండి: