ఏపీలో ఇపుడు రాజకీయాలు ఒక్కసారిగా  వేడెక్కాయి. ఓ వైపు చంద్రబాబు కూడా ఏపీకి వచ్చేశారు. ఆయన ఉండవల్లిలో ఉంటున్నారు. మహానాడు కూడా జామ్  యాప్ ద్వారా జరుపుతున్నారు. పార్టీకి జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉంది.

 

ఢీ అంటే ఢీ అంటోంది. వైసీపీ ఇపుడు ఆపరేషన్ ఆకర్ష్ కి తెర తీసిందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వివిధ కారణాల వల్ల టీడీపీకి దూరంగా ఉన్నారు. వారికి తోడుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు సైకిల్ దిగిపోతే తెలుగుదేశం అధినేత బాబుకు ప్రతిపక్ష నాయకుడి పదవి పోతుంది.

 

జూన్ లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని టాక్. ఆ సమావేశాల నాటికి బాబుని ఉత్త ఎమ్మెల్యేగానే ఉంచాలని వైసీపీ వ్యూహం రచిస్తోందని అంటున్నారు. దాని కోసం మళ్ళీ వేట మొదలైంది. ఒక సమాచారం మేరకు కనీసంగా అరడజన్ మంది దాకా టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్తారని చెబుతున్నారు.

 

వీరంతా వైసీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా అసెంబ్లీలో ప్రత్యేక గ్రూప్ గా ఉంటారు. దాంతో వారి సభ్యత్వానికి ముప్పు రాదు. అదే సమయంలో చంద్రబాబుకు దూరంగా ఉండడం వల్ల టీడీపీ బలం తగ్గిపోతుంది. అసెంబ్లీలో విపక్ష హోదా పోతుంది.

 

ఇల చేతికి మట్టి అంటని పక్కా ప్లాన్ని వైసీపీ అమలు చేస్తోందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎమ్మెల్యేలు అంతా వైసీపీకి మద్దతు ప్రకటించేది ఈ నెల 30వ తేదీ అంటున్నారు. ఆ రోజు ముహూర్తంగా ఎంచుకున్నారని చెబుతున్నారు. ఆ రోజున జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఏడాది అవుతుంది.

 

దాంతో అదే రోజుల సైకిల్ దిగుతారని అంటున్నారు. చూడాలి మరి  ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు కీలకమైన మలుపు తిరగబోతాయని అంటున్నారు.  అదే జరుగుతుందా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: