వైయస్ జగన్ పై సొంత పార్టీలో కొన్ని వర్గాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీలో వినికిడి. ఎంతో ఖర్చు పెట్టి ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే కనీసం పార్టీ లో సరైన గౌరవం, ప్రభుత్వ పరంగా తమకు లాభం లేదన్న కామెంట్లు పార్టీ లో వినబడుతున్నాయి. జగన్ ఒక్కడే సొంత నిర్ణయాలు తీసుకుని ప్రజలకు తనకి కనక్షన్ పెట్టుకొని తమ చేతికి ఎటువంటి పని ఇవ్వటం లేదని వైసిపి ప్రజాప్రతినిధుల లో అసంతృప్తి వ్యక్తం అవుతున్న ట్లు సమాచారం. ఇసుక విధానం అదేవిధంగా మద్యం టెండర్ ఇలాంటివి ప్రజా ప్రతినిధుల సమక్షంలో పనులు చేయిస్తే బాగుంటుంది అని అంటున్నారట. పార్టీ పెద్దల తో కూడా వైసీపీ నాయకులు ఈ విషయంపై తెగ చర్చలు జరుపుతున్నారట.

 

దీంతో మద్యం టెండర్ అదేవిధంగా ఇసుక తవ్వకాల విషయంలో పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోకూడదని గట్టిగా ఇటీవల పార్టీ నాయకులకు జగన్ క్లాస్ పీకారట. ఆల్రెడీ వాటికి సంబంధించిన పూర్తి అధికారాలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి చేతిలో ఉన్నాయని 70 శాతం ఎక్సైజ్ సిబ్బంది నియమించడం జరిగిందని నాయకులకు సూచించారట. కాబట్టి మద్యం విషయంలో అలాగే ఇసుక తవ్వకాలపై జోక్యం చేసుకుంటే, అధికారులు సిబ్బంది బదిలీలలో తల దూర్చితే విషయం వేరేలా ఉంటుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ ఇసుక తవ్వకాలను ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారట.

 

ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్యేలకు జగన్ ఈ విషయంలో క్లాస్ పీకినట్లు వైసీపీ పార్టీలో టాక్. ఎందుకంటే  గతంలో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మద్యం టెండర్ మరియు ఇసుక తవ్వకాలను అడ్డంపెట్టుకుని భయంకరంగా సంపాదించారు. ప్రభుత్వానికి మిగిలింది ఏమీ లేదు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలా చేయటంవల్ల చంద్రబాబుని శాశ్వతంగా ఇంటికి పంపించేలా ప్రజలు తీర్పు ఇచ్చారు. మనల్ని ప్రజలు గట్టిగా నమ్మారు. కాబట్టి గీత దాటి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే విషయం వేరే లా ఉంటుందని జగన్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: