చైనాని ఇపుడు ప్రపంచం ఓ విధంగా ద్వేషిస్తోంది. ఆ దేశం నుంచి కరోనా మహమ్మారి పుట్టి ప్రపంచాన్ని సర్వ నాశనం చేస్తోంది. అందువల్ల చైనా తన ప్రమేయం లేదని ఎన్ని చెప్పినా ఎవరూ నమ్మడంలేదు. నిజానికి  చైనా వైరస్ ని తయారు చేయకపోతే గుట్టుగా ఎందుకు ఉందన్న అనుమానాలు ఓ వైపు ఉన్నాయి.

 

ఇవన్నీ ఇలా ఉంటే కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం ఇబ్బందుల్లో ఉంటే తన పంట పండించుకుందామని  చైనా అనుకుంటోంది. తానే అతి పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదగాలని కూడా కలలు కన్నది. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది. దాదాపు వేయి కంపెనీలు అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలకు చెందినవి చైనా నుంచి తరలిపోతున్నాయన్న షాక్ తో డ్రాగాన్ దేశం ఉంది.

 

అయితే ఆ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని వార్తలు రావడమే చైనాను తెగ కలవరపెడుతోందిట. దక్షిణాసియాలో  తాను ఒక్కటే పెత్తనం చేయాలని, తన జెండా ఎగరాలని చైనా ఇప్పటిదాకా ఎన్నో ఎత్తులు వేస్తూ వచ్చింది. అతి పెద్ద దేశంగా ఉన్నా కూడా చైనాకు త్రుప్తి లేదు. తన సాయుధ బలాన్ని, బుధ్ధి బలాన్ని కూడా ఒకేసారి నమ్ముకుంటోంది. 

 

ఇక భారత్ ఇపుడు కరోనా వేళ ఒక ఆర్ధిక శక్తిగా ఎదిగుతుంది అన్న వార్తలనే చైనా భరించలేకపోతోంది. అందుకే సరిహద్దులో యుధ్ధానికి తెర తీసింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యుధ్ధం తప్పదు అంటున్నారు. సైనికులకు సారధి కూడా అయిన ఆయన ఆ దిశగా వారిని నడిపించాలనుకుంటున్నారు.

 

మరో వైపు నేపాల్ దేశాన్ని కూడా భారత్ మీదకు ఎగదోస్తున్నారు. ఎన్నడూ లేనిది పరుష పదజాలంతో నేపాల్ భారత్ మీద విరుచుకుపడుతోంది. భారత్ తో యుధ్ధం చేస్తామని అంటుంది. ఇది ఆలోచించాల్సిన విషయమే. వెనక చైనా ఉందని ఇట్టే చెప్పేయవచ్చు. అక్కడ వామపక్ష సర్కార్ స్థాపన వెనక చైనా ఉందన్న సంగతి తెలిసిందే.

 

ఇక చైనా యుధ్ధానికి సై తంటే భారత్ కూడా ఊరుకుంటుందా. దానికి సై అంటోంది. మోడీ ఈ మేరకు కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే చైనాకు ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యం ఉంది. దాన్ని చూసుకునే చైనా రెడీ అవుతోంది. మరి ఈ యుధ్ధం వస్తే భారత్ కి సాయంగా ఎవరు వస్తారో చూడాలి.  ఏమైనా మోడీ చైనా పీచమణచేస్తారా. అదే జరగాలని ఒక్క భారతీయులే కాదు, యావత్తు లోకమే గట్టిగా కోరుకుంటోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: