తమ ప్రభుత్వ హయాంలో ప్రజలపై ఎలాంటి భారం వేయలేదు..కానీ జగన్ ప్రభుత్వం ప్రజలపై 50 కోట్ల భారం వేసింది. ఇది మహానాడు వేదికగా చంద్రబాబు, జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శ. ఇక దీంతో పాటు టీడీపీ హయాంలో భవిష్యత్‌లో కరెంట్ చార్జీలు పెంచమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం మాత్రం కరెంట్, మద్యం, ఇసుక, సిమెంట్, ఆర్టీసీ.. అన్నింటిపై చార్జీలు పెంచిందని ఆరోపించారు.

.

అయితే బాబు చెప్పింది కరెక్టే అని తెలుగు తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. తమ హయాంలో ఎలాంటి ఛార్జీలు పెంచలేదని, కానీ జగన్ మాత్రం విపరీతంగా ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శిస్తున్నారు. ఇక ఇదే విషయంపై ప్రజల్లో కూడా అసంతృప్తి ఉందని, కాకపోతే వారు సైలెంట్‌గానే ఉంటున్నారని చెబుతున్నారు. మళ్ళీ ఎక్కడ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తే, కేసులు పెడతారనో, లేక తమకు వచ్చే పథకాలని ఆపేస్తారేమో అని ప్రజలు భయపడుతున్నారని తమ్ముళ్ళు కామెంట్ చేస్తున్నారు.

 

ఇదే సమయంలో వైసీపీ నేతలు ఇంగ్లీష్ మీడియంపై అసత్య ప్రచారం చేస్తున్నారని తమ్ముళ్ళు మండిపడుతున్నారు. తాము ఎప్పుడు ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని చెబుతున్న వైసీపీ నేతలు మాత్రం...టీడీపీనే ఇంగ్లీష్ మీడియం అడ్డుకుంటుందని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మంచి కార్యక్రమాన్ని ఆపేందుకు కొందరు కుట్ర పన్నారని, ప్రభుత్వం వేసే ప్రతి పనిని అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం మాట్లాడుతున్నారని, అసలు తాము అడ్డుకోనేదే అలా ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు.

 

తమ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేశామని, ఇప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం మంచిదేనని, కానీ ఏ మీడియంలో చదవాలనేది విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు ఆప్షన్‌గా ఇవ్వాలని కోరుతున్నామని చెబుతున్నారు. అలా కాకుండా ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం అమలు చేసే విద్యార్ధులకు ఇబ్బందులు ఎదురవుతాయని తమ్ముళ్ళు సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: