భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ వారసుడు ఎవరు...? అనే ప్రశ్న చాలా కాలం నుంచి వినిపిస్తోంది. అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు కూడా ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన నేతగా మోదీ ఉన్నారు. ఒక ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో 99.6 శాతంతో మోదీ ప్రభావవంతమైన నాయకుడిగా నిలవగా ఆ తరువాత స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. 
 
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆ సర్వేలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇండియా ప్రస్తుతం బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరిపాలన మీద ప్రజలకు ఆసక్తి రావడం లేదు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మోదీ తీసుకున్న నిర్ణయాలు ఇతర దేశాల్లో కూడా భారత్ పై మంచి అభిప్రాయం ఏర్పడేలా చేశాయి. మోదీతో పోలిస్తే విభిన్నంగా ఆలోచించినా యోగి ఆదిత్యనాథ్ ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నారు. 
 
ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని తన పాలనతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. దేశంలో మోదీ తరువాత యోగి ఆదిత్యనాథ్ ను బలమైన నాయకుడిగా ప్రజలు విశ్వసిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ అవతలి వ్యక్తులకు కౌంటర్లు ఇవ్వడంలో కూడా తన శైలిలో వ్యవహరిస్తూ ఉంటారు. పారదర్శక పాలనను అందిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 
 
భవిష్యత్తులో కూడా యోగి ఆదిత్యనాథ్ పై ఇలాంటి అభిప్రాయమే ప్రజల్లో ఉంటే బీజేపీలో ప్రధాని మోదీ వారసునిగా యోగి ఆదిత్యనాథ్ కు గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీలో అమిత్ షాను మోదీ వారాసునిగా చాలా మంది పరిగణిస్తున్నారు. ఆయనకు హోం శాఖను కేటాయించటంతో ప్రజల్లో, నేతల్లో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. 2024 నాటికి మోదీ 2.0 పరిపాలన పూర్తవుతుంది. మోదీకి అప్పటికి 73 ఏళ్లు నిండుతాయి. బీజేపీ సాంప్రదాయం ప్రకారం 5 ఏళ్లు నిండిన నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలి. బీజేపీలో మోదీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: