ప్రస్తుతం కరుణ వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనితో ఎక్కడి రాష్ట్ర ప్రజలు అక్కడే ఇరుక్కుపోయారు. దీనితో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి వెళ్లేందుకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు పొరుగు రాష్ట్రాల వారు. ఇది ఇలా ఉండగా తన తండ్రి చనిపోయాడు అని తెలుసుకున్న కొడుకు సొంత ఊరుకు వెళ్లే మార్గమధ్యంలోనే గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదం మిగిలింది కుటుంబ సభ్యులలో.


ఇక ఈ విషయంలో పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా రూరల్ మండలంలో నల్ల వెంకటయ్య గారి పల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన తండ్రి మరణవార్త తెలుసుకున్న కొడుకు గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు చనిపోవడం జరిగింది. దీనితో ఆ కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదం నెలకొంది. నల్ల వెంకటయ్య గారి పల్లెలో ఆంజనేయుడు నాయుడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న కొడుకు బెంగళూరులో జీవనం కొనసాగిస్తున్న బాబు నాయుడు తండ్రి అంత్యక్రియలు కోసం బెంగళూరు నుంచి చిత్తూరుకు ప్రయాణం చేయడం జరిగింది.

 
ఇక పలమనేరు వద్ద అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ అధికారులు బాబు నాయుడుని రాష్ట్రంలోకి అనుమతించలేదు. రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలి అంటే తన తండ్రి చనిపోయిన ఫోటోను కుటుంబ సభ్యులను పంపించాలని కోరడం జరిగింది. దీనితో వారు ఆంజనేయుడు నాయుడు ఫోటోను కుటుంబ సభ్యులు బాబు నాయుడు వాట్స్అప్ కు పంపడం జరిగింది. ఇక తండ్రి మృతదేహం ఫోటో చూసి... ఒక్కసారిగా బాబు నాయుడుకి గుండెపోటు రావడం జరిగింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇక హుటాహుటిగా పోలీస్ అధికారులు వెంటనే బాబు నాయుడుని ఆస్పత్రికి తరలించారు. వైద్య అధికారులు బాబు నాయుడు కు పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడు మరణించినట్లు తెలియజేశారు. దీనితో  కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: