తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఈయన  సాదాసీదా వర్మ అనటం కంటే  సంచలనాల వర్మ వివాదాల వర్మ అంటేనే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుపడతారు. ఎందుకంటే తనదైన సినిమాలతో ఎప్పుడూ సంచలనం సృష్టిస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి పోతూ ఉంటాడు రాంగోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మసినిమా తెరకెక్కించిన అందులో  ఏదో ఒక పెద్ద వివాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. కేవలం సినిమాలతోనేనా  అంటే కాదు అనే చెప్పా.లి ఎందుకంటే తన మాటలతో చేష్టలతో కూడా ఎప్పుడూ వివాదాస్పదంగా మారి పోతూ ఉంటారు రాంగోపాల్ వర్మ. 

 


 అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన ఒక పని ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా  వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ లన్ని  ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా వైరస్ కు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తెరకెక్కిస్తున్నట్లు  ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి షూటింగ్లకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వని నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ  దీనికి సంబంధించిన చిత్రీకరణ ఎక్కడ జరిపారు అన్నది ప్రస్తుతం అందరికీ ఓ ప్రశ్నగా మిగిలిపోయింది. 

 

 అయితే రామ్ గోపాల్ వర్మ సినిమా తీయడంలో తప్పేమీ లేదని కానీ లాక్ డౌన్  అమలులో ఉన్న సమయంలో సినిమా చిత్రీకరణకు ప్రభుత్వాలు అనుమతించరు రాంగోపాల్ వర్మ సినిమాలు తెరకెక్కించడం మాత్రం నిజంగా తప్పే అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు. అదే సమయంలో తన కరోనా  అనే సినిమాలో బ్లీచింగ్ పౌడర్  ప్యారాసిటమాల్ అనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాడిన పదాలను వాడి సంచలనం సృష్టించారు రామ్ గోపాల్ వర్మ.  దీనిపై ప్రభుత్వాలు రాంగోపాల్ వర్మ పై  ఏమైనా కేసులు వేస్తాయ అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: