ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి స్నేహ పూర్వక సంబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించబడినప్పటికీ .. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధంతో తెలుగు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల అభ్యున్నతికోసం కలిసి ముందుకు సాగుతున్నారు. ప్రతి విషయంలో చర్చలు జరిపి రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే గతంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన జల హక్కులకు సంబంధించి కూడా కెసిఆర్ జగన్ మోహన్ రెడ్డి మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. 

 

 అయినప్పటికీ తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జల హక్కులకు సంబంధించి ఓ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంపై గగ్గోలు పెడుతున్నప్పటికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఎవరికి వారు సానుకూలంగానే స్పందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఓ మీడియా కాన్ఫరెన్స్ లో తామిద్దరం  మంచిగానే ఉన్నాము అని మీడియా ఎందుకు మమ్మల్ని చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే లీగల్ గా ముందుకు వెళ్తాము  అంటూ చెప్పుకొచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. 

 

 అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉండి తెలంగాణ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతమేరకు జల హక్కు ఉంది అనే దానిపై ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ఇలా చేయడం ద్వారా ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది అనే విషయా చెప్పారు. తమకు ఉన్న జల హక్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పనిసరిగా వినియోగించుకుంటుందని  అంతకుమించి ఒక్క చుక్క నీటిని కూడా అధికంగా వినియోగించుకోము  అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏ  ప్రాజెక్ట్ నుంచి ఏ  మేరకు ప్రజల హక్కును వినియోగించుకునేది  విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: