తెలుగుదేశం పార్టీ అనగానే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనగానే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఎన్టీఆర్ వేసుకున్న ముద్ర ఆయన చేసిన రాజకీయం అన్నీ కూడా ఒక సంచలనం. నేడు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నేడు ఇలా ఉంది అంటే ఆయన అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాత పార్టీని క్షేత్ర స్థాయిలో నిర్మించిన విధానం అన్నీ కూడా పార్టీని ఒక రేంజ్ లో నిలిపాయి అనేది వాస్తవం. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఇబ్బందులను తట్టుకుని నిలబడింది అంటే ఆయన వేసిన పునాదులే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఇక ఎన్టీఆర్ తీసుకొచ్చిన నాయకులు ఎందరో నేడు కీలక పదవుల్లో ఉన్నారు. ఆయన నుంచి రాజకీయం నేర్చుకుని రాజకీయం చేస్తున్నారు. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రభుత్వాలు నడుపుతున్న వారు ఆయన ను చూసి రాజకీయం నేర్చుకున్న వారే అనేది వాస్తవం. తెలంగాణాలో ప్రభుత్వం మొత్తం కూడా ఎన్టీఆర్ దగ్గర పని చేసిన నాయకులే నడుపుతున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం సహా పలువురు నాయకులు ఎన్టీఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకుని నేడు రాజకీయాల్లో నిలబడిన వారే అనేది వాస్తవం. 

 

ఎన్టీఆర్ తీసుకొచ్చిన అనేక సంస్కరణల కారణంగా ఎందరో రాజకీయ నాయకు లు నేడు రాజకీయాల్లో ఉన్నారు అనేది వాస్తవం. ఆయన తీసుకొచ్చిన కొన్ని రిజర్వేషన్ లు బీసీ లు ఎస్సీ ఎస్టీ లు అందరూ కూడా రాజకీయం చేయడానికి ఉపయోగపడ్డాయి అనేది వాస్తవం. ఆయన నుంచి రాజకీయం నేర్చుకుని దేశాన్ని శాసించిన నాయకులు కూడా ఉన్నారు అనేది వాస్తవం. అలా ఎన్టీఆర్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు అనేది అక్షరాలా నిజం అని అంటారు. అందుకే ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటి కి కూడా ఒక సంచలనం అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: