లాక్ డౌన్ అమలులోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా దేశంలో కరోనా ఏ మాత్రం అదుపులోకి రాలేదు. మొదటి దశ లాక్ డౌన్ లో కరోనా ప్రభావం పెద్దగా లేకపోయిన రెండు ,మూడు దశల్లో విజృంభించింది. ఇక ప్రస్తుతం నాలుగో దశ లాక్ డౌన్ లోనైతే  తీవ్ర రూపం దాల్చింది. రోజుకు కనీసం దేశ వ్యాప్తంగా 6000కుపైగా కేసులు నమోదవుతున్నాయి దీనికి లాక్ డౌన్ లో మినహాయింపులు ఇవ్వడం కూడా ఓ కారణం అయితే  ఆర్థిక  ఇబ్బందుల వల్ల కేంద్రం ముందులా మళ్ళీ పూర్తి లాక్ డౌన్ ను కొనసాగించే సాహసం చేయడం లేదు.  
 
 
ఇక మరోవైపు  ఈనెల 31 తో నాలుగో దశ లాక్ డౌన్  పూర్తి కానుంది. దాంతో లాక్ డౌన్ మరో రెండు వారాలు  పొడిగించాలని కేంద్రం భావిస్తుంది అయితే సడలింపుల అంశాన్ని మాత్రం రాష్ట్రాలకే వదిలేయనుంది. ఒకవేళ లాక్ డౌన్ 5.0 ను కొనసాగిస్తే కేవలం కొన్ని నగరాల్లోనే కఠినంగా అమల్లోకి తెచ్చేలా ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ముంబై, ఢిల్లీ ,కోల్ కతా ,చెన్నై, సూరత్ , బెంగుళూరు, పూణే, థానే, జైపూర్,అహ్మదాబాద్ లో మాత్రమే లాక్ డౌన్ 5.0ను కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది. ప్రస్తుతం ఈనగరాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. మిగితా నగరాల్లో మాత్రం  మరిన్ని మినహాయింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 
 
ఇదిలావుంటే కేంద్రంతో సంబంధం లేకుండా  హిమాచల్ ప్రదేశ్ జూన్ 30వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించకుంటే మాత్రం మరి కొన్ని రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ బాటలోనే పయనించనున్నాయి. మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ 5.0 పై స్పష్టత రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: