జయలలిత.. తమిళనాడు ఒక దేవత. సినీరంగంలో, రాజకీయ రంగంలో ఆమె సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే ఆమె కూడబెట్టిన ఆస్తుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఎంత తక్కుగా లెక్కవేసినా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులు ఆమె పేరిట ఉన్నాయి. కానీ ఆమె అవివాహిత కావడంతో ఆమె ఆస్తులు వివాదాస్పదం అయ్యాయి. ఆమె వీలునామా రాయకపోవడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందాన్న అంశంపై వివాదం ఉంది.

 

 

జయఆస్తులకు సంబంధించి ఓ అన్నాడీఎంకే వేసిన కేసు ఆధారంగా మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీని ప్రకారం.. జయ ఆస్తులు ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ లకే చెందుతాయని తేల్చి చెప్పింది. జయలలిత చట్టబద్ధమైన వారసులు వీరేనని ప్రకటించింది. ఎందుకంటే.. చనిపోయేంత వరకు జయ పెళ్లి చేసుకోలేదు. అందువల్ల ఆమెకు దీప, దీపక్ తప్ప మరెవరూ చట్టబద్ధమైన వారసులు లేరని కోర్టు తేల్చిచెప్పింది.

 

 

దీంతో ఇప్పుడు జయలలిత ఆస్తిపాస్తులన్నీ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ లేక చెందనున్నాయి. జయలలిత పేరుపై అధికారిక లెక్కల ప్రకామే రూ. 913 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి కూడా జయ నివాసమైన వేదనిలయం కాకుండా.. మద్రాసులో కీలక ప్రాంతంలో ఉన్న ఈ వేద నిలయం విలువ కనీసం రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా.. అందువల్ల జయ ఆస్తి దీప, దీపక్ లకు దాదాపు చెరో 500 కోట్లు దక్కే అవకాశం ఉంది.

 

 

అయితే కోర్టు మాత్రం వేద నిలయంలో సగభాగాన్ని సీఎం కార్యాలయంగా, మిగిలిన సగభాగాన్ని ఆమె స్మారకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే వేద నిలయంపై వారసులకూ హక్కులు ఉంటాయి కాబట్టి వారి అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పింది. మొత్తానికి జయ వారసులకు ఉన్నపళంగా వందల కోట్ల రూపాయలు దక్కనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: