ఇప్పటివరకు సరి బేసి పద్దతిలో హైదరాబాద్ లో  షాపులు ఓపెన్ కాగా నేటి నుండి మాత్రం అన్ని షాపులు తెరువడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఒక్క మాల్స్ మాత్రం తెరవడానికి వీలులేదని ఆదేశాలు జారీచేసింది. ఒక షాప్ తప్పించి మరొక షాప్ ఓపెన్ చేస్తే ఆయా షాఫుల వద్ద జనం ఎక్కువగా గుమిగూడుతుండడం తో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది.
 
మరో వైపు నిన్న తెలంగాణ లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 107 కేసులు నమోదు కాగా ఇందులో కేసులు విదేశాల నుండి వచ్చినవి కాగా 19వలసకూలీలవి ,39లోకల్ కేసులు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు సింగల్ డేలో ఇదే హైయెస్ట్.  ఈకేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2098కు చేరింది అందులో ఇప్పటివరకు 714మంది బాధితులు కోలుకోగా 63మంది మరణించారు ప్రస్తుతం 1321కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. 
ఇక నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 7000కేసులు నమోదుకావడం గమనార్హం. మొత్తం ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 158000 కు చేరగా అందులో 4300 కుపైగా మంది కరోనా వల్ల మరణించారు. గత కొద్దీ రోజుల నుండి దాదాపు అన్ని నగరాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కాగా మరో మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ 4 కూడా ముగియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: