ప్రపంచ సూపర్ పవర్ స్థానానికి అమెరికా మరియు రష్యా ఎప్పటికప్పుడు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఆయుధ పరంగా ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన దేశాలుగా అమెరికా మరియు రష్యాలు పిలవబడేవి. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగిన ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఈ రెండు దేశాలలో ఏదో ఒక దానికి ప్రమేయం ఉండేది. ఎప్పటికప్పుడు తమ ఆధిపత్య పోరు ప్రపంచం మీద చెలాయించడానికి అమెరికా మరియు రష్యా ఏదో ఒక కారణం చెబుతూ చెలరేగిపోయేవి. చిన్న చిన్న దేశాలు అయితే ఈ రెండు అగ్ర దేశాలను చూసి వణికిపోయేవి. అటువంటి ఈ అగ్ర దేశాలను ఇప్పుడు కరోనా వైరస్ నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేనివిధంగా భయంకరంగా వైరస్ ప్రబలి ఉంది.

 

మరణాల విషయంలో కూడా అమెరికాలో రోజుకి వేల సంఖ్యలో మనుషుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులో అత్యధికంగా అమెరికాలోనే ఎక్కువ నమోదు కావడం గమనార్హం. మరణాలు బట్టి చూస్తే త్వరలోనే అమెరికా లక్షకు చేరుకోవడానికి దగ్గరగా ఉంది. ముఖ్యంగా వైరస్ ఈ స్థాయిలో అమెరికాలో వ్యాప్తి చెందడానికి కారణం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు అని విమర్శలు అమెరికాలో వినబడుతున్నాయి. వైరస్ వచ్చిన ప్రారంభంలో ఇది పెద్ద అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఏమీ కాదని చాలా చులకనగా మాట్లాడటం తో అమెరికన్లు సీరియస్ గా తీసుకోకపోవడంతో ఈ పెను విపత్తు అమెరికాలో సంభవించిందని ఆ దేశస్థులు సీరియస్ అవ్వుతున్నారు. 

 

అదేవిధంగా రష్యాలో కూడా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. మొదటిలో రష్యా దేశం లో కరోనా వైరస్ కేసులు ఎక్కడ బయట పడలేదు. చైనా సరిహద్దుల్లో ఉండే రష్యా దేశంలో కరోనా వైరస్ కేసులు బయటపడక పోవడం తో అంతర్జాతీయ మీడియా రష్యా దేశాని పొగడ్తలతో ముంచెత్తింది. కానీ తరువాత ఒక్కసారిగా వైరస్ చుట్టుముట్టింది. కేసుల విషయంలో రెండు లక్షలకు పైగా నమోదు అవగా...మరణాలు చాలా తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తోంది. రష్యా లో అత్యధికంగా వెలుగుచూసిన కేసుల్లో సగానికిపైగా రాజధాని మాస్కోలో బయటపడటం గమనార్హం. ఇటువంటి నేపథ్యంలో రెండు ప్రపంచ సూపర్ పవర్ దేశాలు అయిన రష్యా మరియు అమెరికాలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరికీ బుర్ర గిర్రున తిరుగుతోంది. పవర్ ఫుల్ నేతలుగా ప్రపంచాన్ని గడగడలాడించిన ఇద్దరికీ ఇప్పుడు కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: