వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న తరుణంలో ప్రతి శాఖతో చర్చలు జరుపుతున్న విషయం అందరికీ తెలిసినదే. “మన పాలన- మీ సూచన” కార్యక్రమం ద్వారా ఈరోజు విద్యాశాఖ అధికారులతో మంత్రులతో మరియు విద్యార్థులతో భేటీ అయ్యారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో విద్యావ్యవస్థ ఉందో గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అన్న విషయాలు గురించి చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. కచ్చితంగా పేదవాడికి చదువు అందిస్తే వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయని వైయస్ జగన్ ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నా అని నా మీద చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను చెప్పేది ఏమిటంటే నేను నా పిల్లల భవిష్యత్తు పై పెట్టుబడి పెడుతున్నాను అంటూ రాష్ట్రంపై తనకున్న ప్రేమను చాటారు జగన్.

 

అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు వాళ్ల పిల్లలు చూస్తే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కానీ పేద వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదవకూడదు అన్నట్టుగా ప్రతిదానికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య అందించే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలు ఆగస్టు మూడో తారీకు నుండి తెరుచుకో బోతున్నట్లు జగన్ క్లారిటీ ఇచ్చారు. పాఠశాలలకు మరియు జూనియర్ కాలేజీలకు మౌలిక వసతులు కల్పించే విషయంలో 'నాడు నేడు' కార్యక్రమం చాలా కీలకమని తెలిపారు.

 

రాష్ట్రంలో చదువు ఏ పేదవాడికి భారం కాకూడదని ప్రభుత్వం కృషి చేస్తోందని పూర్తి స్థాయిలో 100% ఫీజు రీయింబర్స్మెంట్ మన ప్రభుత్వం అందిస్తోంది అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆగస్టు 3 వ తారీకు పాఠశాల ఓపెన్ చేసే టైం లో పిల్లలకు మూడు జతల స్కూల్ యూనిఫామ్, పుస్తకాలు, ఒక జత షూస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మొత్తం మీద రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ తన ప్రభుత్వం ద్వారా అందించబోతున్నారు రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ జగన్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: