టెక్నాలజీ పితామహుడిగా తనకు తానే సాటి అని గొప్పలు చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజంగానే ఇప్పుడు ఆన్లైన్ ను ఉపయోగించుకుని ప్రజల ముందుకు సరికొత్త విధంగా వస్తున్నారు. చంద్రబాబుకు వయసు పైబడి పోయిందని, ఇక యాక్టివ్ గా రాజకీయాల్లో ఎక్కువ కాలం తిరగలేరనే వాదనలు తెరపైకి వస్తున్న తరుణంలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ నిబంధనలు చంద్రబాబుకి మరింతగా కలిసొచ్చాయి. నిత్యం ఆయన తన ఇంటి నుంచే జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ, నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, చంద్రబాబు తాను ప్రత్యక్షంగా అందుబాటులో లేను అనే లోటు ఎక్కడా తెలియకుండా పార్టీ శ్రేణులతో నిత్యం టచ్ లో ఉంటూ పార్టీ కార్యక్రమాలకు ఎక్కడా బ్రేక్ పడకుండా చేసుకోగలిగారు. ఈ సందర్భంగా టెక్నాలజీకి తాను ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనే విషయాన్ని చంద్రబాబు మరోసారి చేసి చూపించారు.

 

IHG


 ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జూమ్ యాప్ బాగా ఫేమస్ అయింది. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు కూడా జూమ్ ద్వారానే చాలా విద్యా సంస్థలు నడిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని చంద్రబాబు కూడా నూటికి నూరుపాళ్లు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ప్రపంచంతో పాటు తమ పార్టీ కూడా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంది అనే భావన ప్రజల్లో కలిగేలా చేయడంలో చంద్రబాబు బాగానే సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం మహానాడు కార్యక్రమం టిడిపి నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు, ఎక్కడ మహానాడును నిర్వహించినా లక్షలాది మంది కార్యకర్తలు హాజరయ్యేవారు. వారికోసం విందు ,వినోదాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేవారు. కానీ గత ఏడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా మహానాడు వాయిదా పడింది.


 ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మహానాడు వాయిదా పడుతుందని అందరూ భావించగా, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు మహానాడు నిర్వహిస్తున్నారు. దీని వల్ల పార్టీకి కోట్లాది రూపాయల ఖర్చు లు కలిసి వచ్చినట్లే. అదే సమయంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు ఇది దోహదం పడుతుంది. ఏమైనా ఆన్లైన్ లో పార్టీ కార్యక్రమాలు ఇలా కూడా నిర్వహించవచ్చు అనే గొప్ప సందేశాన్ని చంద్రబాబు దేశానికి ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: