వైస్సార్సీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి వైయస్ జగన్ అంతా తానై అధ్యక్షుడిగా రాణించడం అందరికీ తెలిసిందే. ఎలాంటి నిర్ణయమైనా జగన్ ఓకే చేస్తేనే అది పార్టీలో అమలు అవుతోంది. ఆ విధంగా ముందు నుండి పార్టీకి అధ్యక్షుడిగా అనేకమైన సంచలన నిర్ణయాలు తీసుకుని సక్సెస్ ఫుల్ రాజకీయ నేతగా రాణిస్తున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో చాలా పనులలో జగన్ బిజీ బిజీ కావడంతో పార్టీ విషయానికి వచ్చే సరికి అంతగా దృష్టి పెట్టలేక పోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ సమావేశాలు, నాయకులను సమన్వయం చేసుకునే విషయంలో జగన్ వెనకబడ్డారనే చర్చ పార్టీలో బలంగా వినపడుతోంది.

 

అధికారంలోకి రావటం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయాలలో బిజీ అయి చాలా వరకు జగన్ పార్టీని పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదని వైసీపీ నాయకులే అంటున్నారు. ఇదే సమయంలో జగన్ కూడా పార్టీపై దృష్టి ఎక్కువ పెట్టలేక పోతున్నాను అని ఇటీవల సన్నిహితుల దగ్గర అన్నారట. కాబట్టి పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ పెద్దలతో ఇటీవల జగన్ చర్చించినట్లు త్వరలో తన అధ్యక్ష స్థానానికి జగన్ రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. కాగా జగన్ అధ్యక్ష రాజీనామా పథకం రచయిత ఎవరు అనే చర్చ వచ్చిన టైంలో విజయసాయిరెడ్డి పేరు పార్టీలో వినబడుతోంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే  జగన్ సీఎం అయ్యాక పార్టీ కార్యక్రమాలను ఎక్కువగా సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తూ వస్తున్నారు.

 

ఒక పక్క పార్టీ మరో పక్క ఢిల్లీలో కేంద్రంతో డీలింగ్స్ అంత దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ఇటీవల అటూ ఢిల్లీ రాజకీయాలు ఇటు పార్టీ కార్యకలాపాలు రెండూ కూడా మోత బరువు ఎక్కువ అయిపోయిందట. దేశంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు సంపాదించిన పార్టీగా నాలుగో స్థానంలో వైసిపి ఉండటంతో రాబోయే రోజుల్లో కేంద్రంలో ఎక్కువ పనులు విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో జరగనున్నట్లు సమాచారం. దీంతో విజయసాయి రెడ్డి... జగన్ కి ఇంక లాభం లేదు పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని మీరు రాజీనామా చేస్తే బెటర్ అని సూచించినట్లు సమాచారం. దీంతో జగన్ రాజీనామా చేస్తే ఆయన ప్లేసులో సోదరి షర్మిల గాని జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గాని పదవి చేపట్టే అవకాశం ఉందని పార్టీలో టాక్. కాగా సజ్జల రామకృష్ణారెడ్డి కి మొదటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులతో పూర్తి సత్సంబంధాలు ఉండటంతో అధ్యక్ష పదవి ఆయనకే వచ్చే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: