ఇండియాలో కరోనా వైరస్ రోజురోజుకీ భయంకరంగా విస్తరిస్తోంది. లాక్ డౌన్ దేశంలో పటిష్టంగా అమలు చేసిన సమయంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజుకి రెండు వేల లోపు మాత్రమే బయటపడేవి. అటువంటిది ప్రస్తుతం కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలు, సడలింపులు విషయంలో వెసలుబాటు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలతో దేశంలో రోజుకి ఇప్పుడు ఐదు వేల నుండి ఆరు వేల లోపు మధ్య పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇదే సమయంలో రవాణా విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా 'ఆరోగ్య సేతు' యాప్ అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి గాను అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్ వలన చుట్టూ ప్రక్కల కరోనా రోగులను ఈజీగా ట్రాక్ చేయవచ్చు అని కేంద్రం ఇది తప్పనిసరిగా చేస్తూ ఆదేశాలను ఇచ్చింది.

 

దేశవ్యాప్తంగా ఇప్పుడు దీనిని కోట్లాదిమంది భారతీయులు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇదే టైంలో విమాన ప్రయాణం చేసే వారికి రైలు ప్రయాణం చేసే వారికి ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు ఇవ్వటంతో కీలకంగా మారింది. ఆ విషయం ప్రక్కన పెడితే టెక్నికల్ విషయంలో మనలో గాని లేకపోతే చుట్టుపక్కల అయినా ఉండి ఉంటారు అలాంటివారికి కేంద్ర సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

 

'ఆరోగ్య సేతు' యాప్ లో ఉన్న మూడు భద్రతా పరమైన బగ్స్ కనిపెట్టి చూపించిన వారికి ఒక్కో బగ్ కి లక్ష రూపాయలు ఇస్తామని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నీతా వర్మ మీడియాకు తెలిపారు. ఇటీవల ఆమె యాప్‌ ఓపెన్‌సోర్స్‌ కోడ్‌ విడుదల చేసారు. ఈ సందర్భంగా కోడి మెరుగుదలకు ఎవరైతే మంచి సూచనలు ఇస్తారో వారికి లక్ష రూపాయలు ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇదే టైమ్ లో ఆన్లైన్ డెలివరీ చేసే వాళ్ళు కూడా దీనిని వాడుకోవాలని ఆమె తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: