పాకిస్దాన్ ఎప్పుడైతే మనదేశం నుండి విడిపోయిందో అప్పటి నుండి, భారత్‌ను శత్రుదేశంగా భావించడం మొదలు పెట్టిందట.. ఆనాడు రాజుకున్న నిప్పు రవ్వలు ఇప్పటికి ఆరిపోనే లేదు.. నిత్యం ఏదో ఒక విషయంలో భారత్‌ను నష్టపరచాలని చూడటం చివరికి భంగపడటం.. ఇలా అనేక కోణాల్లో పాకిస్దాన్ తన వక్రబుద్ధిని బయటపెడుతుంది.. అయితే తాజాగా పాక్ నుండి వచ్చిన ఒక పావురం పలు సందేహలను కలిగిస్తుందన్న విషయం తెలిసిందే.. ఇదివరకే భారత్ పై గూఢచర్యం చేయడానికి పాకిస్తాన్ పావురాలను పంపిస్తున్న సంగతి తెలిసిందే..

 

 

ఈ నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ పావురం కశ్మీర్ లో కలకలం రేపింది. ఎందుకంటే ఆ పావురంపై గులాబీ రంగు ఉండడం, కాలికి రింగ్ ఉండడం, దానిపై నంబర్ ఉంటడడంతో పోలీసులు దానిని అదుపులోకి తీసుకున్నారు. పావురంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇప్పుడా పావురానికి సంబంధించి ఆసక్తికర అంశం బయటపడింది. ఇండియాలోకి వచ్చిన ఆ పావురానికి, పాక్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అది గూఢచారి పావురం కాదంటూ సరిహద్దులోని పాక్ గ్రామానికి చెందిన హబీబుల్లా అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. పొరపాటున అధికారులకు దొరికిన తన పావురం తనకు ఇప్పించాలని కోరుతున్నాడు. అంతే గాక పావురం రింగుపై ఉన్న నంబరు తన ఫోన్ నంబరని అతడు చెబుతున్నాడు.

 

 

మరి ఇతడు చెబుతున్న విషయం ఎంతవరకు నిజమో తెలియదు.. అందులో ఇప్పటికే భారత్‌పై ద్వేషంతో రగిలిపోతున్న పాక్ ఈ పావురం మీద మరింతగా దర్యాప్తు చేస్తే నిగూఢమైన నిజాలు బయటకు వస్తాయని భావించి అతని ద్వారా ఈ నాటకం ఆడిస్తూ ఉండవచ్చని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారట.. ఏమో కావచ్చూ అసలే అవకాశం వస్తే ఇండియాను నాశనం చేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్న పాక్‌ను అసలే నమ్మడానికి వీలులేదు.. అక్కడ బ్రతకడమే కష్టంగా మారిన పరిస్దితుల్లో ఇంకా కక్ష సాధింపు చర్యలు చేస్తున్న పాక్ వక్ర బుద్ధి అందరికి తెలిసిందే.. మరి పావురం విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: