జగన్ ఏడాది పాలన సందర్భంగా మేధోమథనం పేరుతో సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాలనలో విద్యారంగం ఎలా ఉందన్న విషయంపై తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష చూస్తే.. జగన్ పాలనలో విద్యారంగం సమూలంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోందని చెప్పక తప్పదు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సైతం చక్కటి విద్య అందాలనే ఆశయంతో పనిచేస్తున్న జగన్ సర్కారు.. ఆ దిశగా తొలి ఏడాదిలో చక్కటి అడుగులు వేసింది.

 

 

పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చబోతున్నారు. నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయబోతున్నారు.. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 47,656 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలున్నాయి. మొదటి విడతలో 15,715 ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి పాఠశాలల్లోనూ ఫర్నీచర్‌, టాయిలెట్లు ఉండాలి.

 

 

80 లక్షల మంది పిల్లలకు లాభం చేకూరేలా ఈ జనవరిలో అమ్మఒడి ప్రారంభించారు. 43 లక్షల మంది తల్లులకు రూ.6350 కోట్లను నేరుగా బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేశారు. అంతే కాదు. బడికి వచ్చే పిల్లల కోసం జగనన్న గోరు ముద్ద.. పథకం అమలు చేస్తున్నారు. పిల్లల కోసం రుచికరమై మెనూ తయారు చేశారు. ఇకపై పాఠశాలలు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక అందచేస్తారు. ఇక ఇంగ్లిష్‌ మీడియం కూడా వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోతున్నారు.

 

 

మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో జగన్ సర్కారు విప్లవం తీసుకొచ్చినట్టే చెప్పాలి. అంతే కాదు.. దీని కోసం వేల కోట్లు ఖర్చువుతున్నా లెక్క చేయడం లేదని.. ఇదంతా మన పిల్లల భవిష్యత్‌పై పెడుతున్న పెట్టుబడిగా జగన్ చెప్పారంటే.. విద్యారంగం ప్రక్షాళనపై జగన్ సర్కారుకు ఉన్న చిత్త శుద్ధి అర్థం చేసుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: