సర్కారీ చదువులు అంటే.. అవి యువతనూ రెంటికీ చెడ్డరేవడిగా మారుస్తాయన్న అభిప్రాయం ఉంది. సర్కారు బళ్లలో చదువుకున్న వాళ్లు పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేదు.. ఇటు పోనీ గ్రామాల్లో వ్యవసాయం అయినా చేసుకుంటారా అంటే.. చదువుకున్నామన్న ఫీలింగ్‌ తో అదీ చేయరు. అటు ఉద్యోగాలు రాక.. ఇటు పొలం పనులు రాక.. వారు రెంటికీ చెడ్డ రేవడిగా తయారవుతున్నారన్న అభిప్రాయం ఉంది. అందుకే దీన్ని సమూలంగా మార్చాలని జగన్ సర్కారు నిర్ణయించింది.

 

 

జగన్ ఏడాది పాలన సందర్భంగా మేధోమథనం పేరుతో సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాలనలో విద్యారంగం ఎలా ఉందన్న విషయంపై తాజాగా సమీక్ష నిర్వహించారు. ఇందులో జగన్ ఏమన్నారంటే.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాసంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. మంచి చదువులు దక్కాలంటే చైతన్య, నారాయణ వంటి ప్రైవేటు సంస్థలే దిక్కు అనే పరిస్థితి తీసుకొచ్చారు.

 

 

జగన్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయ దలిచారు. ప్రతి మండలంలో జూనియర్‌ కాలేజీ ఉండాలని నిర్ణయించారు. 100శాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రులపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఈ ఏడాదికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ రూ.4200 కోట్లను ఇప్పటికే చెల్లించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బులను.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తాంరు.

 

 

అంతే కాదు.. హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు వసతి దీవెన కింద రెండు దఫాల్లో రూ.20వేలు ఇస్తారు. కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేసి.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా చేయబోతున్నారు. అందుకు అనువుగా విద్యా వ్యవస్థను తీర్చి దిద్దుతున్నారు. పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కోసం ఇద్దరు రిటైర్డ్‌ జడ్జిలను నియమించారు. ఈ మార్పులన్నీ అమలైతే చదువు పూర్తి కాగానే ఉద్యోగం అందుకునేంత సత్తాతో విద్యార్థులు విద్యాసంస్థ నుంచి బయటకు వస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: